Begin typing your search above and press return to search.
మాటలే కాదు చేతల్లోనూ కాణిపాకం ఆలయంలో సత్యప్రమాణం చేశాడు
By: Tupaki Desk | 11 Aug 2021 7:30 AM GMTరాజకీయాల్లో సవాళ్లు.. ప్రతిసవాళ్లు మామూలే. కానీ.. ఇవన్నీ మాటలకే పరిమితం అవుతాయే తప్పించి చేతల్లో మాత్రం కనిపించదు. ఇప్పుడా లోటు తీర్చారు బీజేపీ ఫైర్ బ్రాండ్ విష్ణువర్దన్ రెడ్డి. రెండుతెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని ఒక ప్రత్యేకత చిత్తూరులోని కాణిపాకం దేవాలయం సొంతం. అక్కడ చేసే సత్య ప్రమాణానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. తప్పుడు ప్రమాణాలు చేస్తే మొత్తానికే మునిగిపోతారని చెబుతారు. అందుకే.. వివాదం ఏదైనా చోటు చేసుకున్నప్పుడు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేద్దామా? అన్న సవాల్ వినిపిస్తూ ఉంటుంది. సాదాసీదా ప్రజల సంగతిని పక్కన పెడితే.. రాజకీయ నేతల మధ్య సవాళ్లలోనూ తరచూ కాణిపాకం దేవాలయంలో సత్యప్రమాణం గురించి ప్రస్తావన వస్తుంది కానీ.. అదేదీ ఆచరణలో మాత్రం కనిపించదు.
తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించారు ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ విష్ణువర్దన్ రెడ్డి. ఇటీవల కాలంలో మరెప్పుడూ లేని రీతిలో కాణిపాకం దేవాలయంలో సత్యప్రమాణానికి సిద్దమయ్యారు బీజేపీ నేత. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి విష్ణువర్దన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇందులో భాగంగా విష్ణుపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో.. స్పందించిన ఆయన తాను కాణిపాకంలో సత్యప్రమాణం చేస్తానని చెప్పారు.
తానెటువంటి అవినీతికి పాల్పడలేదని.. తనపై చేసిన ఆరోపణలన్ని తప్పుడువేనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటూ వేదపండితులు.. బీజేపీ శ్రేణుల సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తిగా పది రోజుల్లో ప్రమాణం చేస్తానని చెప్పి.. తన మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. తన సత్యప్రమాణం చేసే సమయంలో ఎమ్మెల్యే రాచమల్లును కూడా ఆహ్వానించినా ఆయన రాలేదన్నారు. విష్ణు సత్యప్రమాణం చేస్తే తాను వస్తానని చెప్పిన ఎమ్మెల్యే.. తీరా ప్రమాణం చేసే సమయానికి మాత్రం రాకపోవటం గమనార్హం.
ఇంతకీ రాచమల్లుకు.. విష్ణుకు మధ్య మాటల యుద్ధానికి కారణం కడప జిల్లా పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహా ఏర్పాటు వివాదమే. టిప్పు సుల్తాన్ దేశ భక్తుడని రాచమల్లు.. కాదు ఆయన దేశద్రోహి అని విష్ణు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధమే కాదు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. విగ్రహ ఏర్పాటు కోసం కౌన్సిల్ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని.. అక్కడ నుంచి అనుమతులు రాగానే.. ముందుకు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు.
గతంలో వేర్వేరు అంశాల మీద రాజకీయ నేతలు ఆలయాల్లో ప్రమాణాలు చేయటం.. తలనీలాలు సమర్పించుకోవటం లాంటివి చేశారు కానీ.. కాణిపాకంలో మాత్రం ఇలాంటివి చోటు చేసుకోలేదని చెబుతారు. మొత్తంగా సత్యప్రమాణం చేయటం ద్వారా విష్ణు తాను చెప్పింది చేసినట్లైంది. ఎమ్మెల్యే రాచమల్లు కూడా వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.