Begin typing your search above and press return to search.

బీజేపీ వ‌ర్సెస్‌ ఆప్‌.. ఇదో న‌మ్మ‌క 'వ్యూహం!'

By:  Tupaki Desk   |   8 Dec 2022 12:30 PM GMT
బీజేపీ వ‌ర్సెస్‌ ఆప్‌.. ఇదో న‌మ్మ‌క వ్యూహం!
X
రాజ‌కీయాల్లో న‌మ్మ‌క ద్రోహాలు మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ, గుజ‌రాత్ ఎన్నిక‌లు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రి ణామాలు.. అదేస‌మ‌యంలో మారుతున్న‌రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. రాజ‌కీయాల్లో న‌మ్మక ద్రోహాలే కాదు.. న‌మ్మ‌క 'వ్యూహాలు' కూడా ఉంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. న‌మ్మక వ్యూహాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్ధ‌మ‌వుతుంది.

గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందు.. ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ..అడుగు పెట్టిం ది. వ‌చ్చీ రావ‌డంతోనేఉచితాలు అంటూ.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింది. వాస్త‌వానికి అంతో ఇంతో ఆర్థికంగా బ‌లంగా ఉన్న గుజ‌రాత్‌లో ప్ర‌జ‌లు ఉచితాల‌కు మొగ్గ‌ర‌ని తెలిసినా.. కూడా ఆప్‌.. ఈ పాచిక వేయ‌డం ద్వారా.. బీజేపీ ప్ర‌భుత్వ వ్య‌తిర‌క‌త‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింది.

ఇక‌, ఈ విష‌యాన్ని ముందుగానే గుర్తించిన కాంగ్రెస్‌.. ఆప్‌ను బీజేపీకి 'బీ' అంటూ.. ప్ర‌చారం చేసినా.. అనుకున్న విధంగా క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయింది. అంతేకాదు.. ఆప్ అస‌లు పార్టీనే కాదంటూ.. చౌక‌బారు వ్యాఖ్య‌లు చేసింది. నిజానికి బీజేపీ వ్యూహాత్మ‌కంగానే ఆప్‌ను ప్రోత్స‌హించింద‌ని ఒక‌వైపు ప‌త్రిక‌లు ఘోషించినా.. కాంగ్రెస్ మాత్రం నిస్తేజంగా మారిపోయింది.

దీంతో కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల్లో 77 స్థానాలు ద‌క్కించుకుంటే.. తాజాగా వ‌చ్చిన ఫ‌లితాల్లోకేవ‌లం 20 కి మాత్ర మే ప‌రిమితం అయిపోయింది. నిజానికి బీజేపీ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు త‌మ‌కే ద‌క్కుతుంద‌ని కాంగ్రెస్ లెక్కులు వేసుకుంది. కానీ, ఆప్ ఎంట్రీతో.. ఇదంతా పటాపంచ‌లు అవ‌డ‌మే కాదు.. సంస్థాగ‌త కాంగ్రెస్ ఓట‌రు కూడా.. ఆప్ వైపు మ‌ళ్లిపోయాడు. ఫ‌లితంగా.. 9 స్థానాల్లో ఆప్ విజ‌యం ద‌క్కించుకుంది. బీజేపీ అతి పెద్ద రికార్డు స్థాయి మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.