Begin typing your search above and press return to search.
హిందూత్వ... తురుపు ముక్కేనా...?
By: Tupaki Desk | 12 Dec 2021 3:30 PM GMTభక్తులలో మహా భక్తులు మేము అని కొందరు చెప్పుకుంటారు. నిజానికి వారికీ వీరికీ గొప్ప తేడా అంటూ ఏమీ ఉండదు, కానీ పోటీ వచ్చినపుడు మాత్రమే పోలికలూ ముందుకు వస్తాయి. దేశంలో బీజేపీ అధికారంలోకి పలు మార్లు వచ్చిన తరువాత ఏమి సాధించింది అంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేరు కానీ హిందూత్వ నినాదాన్ని మాత్రం బలంగా అందరూ వినిపించేలా చేసిన గొప్పదనం ఆ పార్టీదే. ఈ రోజు చాలా మంది తాము వీర హిందువులమని జబ్బలు చరుస్తున్నారు. తమ కట్టూ బొట్టూ చూడమని కూడా కోరుకుంటున్నారు.
ఈ జాబితాలో అగ్ర భాగాన కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్నా చెల్లెళ్లు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అపర హిందువులు తామేనని చెప్పుకుంటూ హిందూత్వ అంటే ఏంటో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జైపూర్ టూర్ లో రాహుల్ గాంధీ హిందూత్వ అంటే ఏంటి హిందువు అంటే ఎవరు అన్న దాని మీద తనదైన భాష్యం చెప్పారు. ఎవరికీ భయపడని వారు, అన్ని మతాలను గౌరవించేవారు హిందువులు అని ఆయన నిర్వచనం చెప్పారు.
ఇక అధికారం కోసం గట్టిగా నినాదాలు చేసేవారు నకిలీ హిందువులు అని ఆయన బీజేపీని ఘాటుగానే విమర్శించారు. ఈ దేశంలో ఇపుడు రాజ్యమేలుతున్నది అలాంటి హిందూత్వ రాజే అని కూడా పేర్కొన్నారు. అలాంటి హిందూత్వ రాజ్ ని నిర్మూలించి హిందూ రాజ్యాన్ని తేవాలని కూడా రాహుల్ గట్టిగా కోరుకున్నారు.
నిజానికి రాహుల్ సంగతిని పక్కన పెడితే ఈ దేశాన్ని 58 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ నోటి వెంట హిందూ రాజ్యాన్ని తెస్తామని ఏ రోజు మాట రాలేదు. అంతే కాదు ఈ దేశంలో హిందువులు అన్న వారు ఉన్నారన్న స్పృహ కూడా ఆ పార్టీకి అప్పట్లో ఏ కోశానా లేదు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఇందిరా గాంధీ ఏలుబడిలో రాజ్యాంగాన్ని సవరించి సెక్యులర్ అన్న పదాన్ని చేర్చారు. అంటే లౌకిక రాజ్యం అని.
మరి లౌకిక భావన ఒక్క హిందువులకే ఉండాలా మిగిలిన వారికి ఉండకూడదా అన్న దాని మీద హిందువుల నుంచి తీవ్ర నిరశన వచ్చింది. అలా వారిలో పెరిగిన అసంతృప్తిని రాజకీయంగా బీజేపీ వాడుకుంది అని కూడా చెప్పుకోవాలి. ఈ దేశంలో హిందుత్వ వినిపించినా, హిందువు అన్న శబ్దం పదే పదే చెవులలో మోగుతున్నా దానికి కారణం కాంగ్రెస్ ఒక మతం పట్ల అనుసరించిన నిర్లిప్త వాదం ప్రధాన కారణం అయితే అలా రాజుకున్న సెగను తనకు అనుకూలం చేసుకున్న బీజేపీ మరో కారణం.
ఈ దేశంలో ఈ రోజుకీ 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మెజారిటీ ఇందులో ఎవరు అంటే హిందువులే అని చెప్పడానికి ఏ లెక్కలూ కూడా అవసరం లేదు. ఇక రాహుల్ గాంధీ హిందూత్వ నిర్వచనం ఎలా ఉన్నా హిందూత్వ అంటే చంపడం కానే కాదు, అధికారం అందుకోవడం అంతకంటే కాదు, హిందూత్వ అన్నది నిజానికి మతం కూడా కాదు, అది విశ్వజనీనమైన అద్భుత మానవీయ భావన.
అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అన్న విశాలమైన దృక్కోణానికి హిందూత్వ సరైన నిర్వచనం అని చెప్పుకోవాలి. ఈ రోజు హిందూత్వ అన్న మాట వాడకపోయినా అలా తుచ తప్పకుండా దానిని ఆచరిస్తున్న దేశాలలో శాంతి ఉంది. లేని చోట్ల అశాంతి రాజ్యమేలుతోంది. ఓట్ల కోసం హిందూత్వను ఎవరు వాడుకున్నా అది క్షమార్హం కాదు, అలాగే బుజ్జగింపు రాజకీయాలు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసి అధిక సంఖ్యాకుల మనో భావాలను ఎవరు దెబ్బతీయాలనుకున్న వారి రాజకీయ పతనం ఏ స్థాయిలో ఉంటుందో ఈ రోజు భారత దేశంలో కొన్ని పార్టీలను చూస్తే అర్ధమవుతుంది.
నిజానికి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మతాలను ఉద్ధరించడానికి పుట్టలేదు, ఆ అవగాహన జనాలకు ఉంది. అదే సమయంలో ఆయా మతాలు, వారి ఆలోచనలు, భావాలను గుర్తించి గౌరవిస్తే అంతకంటే చేసే పెద్ద మేలు కూడా ఉండబోదు. ఓట్ల రాజకీయాల కోసం హిందూత్వ భావనలతో చెలగాటం ఆడే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు అన్నది మాత్రం నిజం. భారత దేశం సృజించిన పవిత్ర భావన హిందూత్వ భాగుంటే దేశమే కాదు, ప్రపంచం కూడా బాగుంటుంది. అందువల్ల సంకుచిత రాజకీయాలకు తురుపు ముక్కలా దానిని వాడుకోకుండా ఉంటేనే ఏ రాజకీయ పార్టీకైనా మంచిది.