Begin typing your search above and press return to search.
మునుగోడులో యాక్షన్ సీన్లు... రాళ్ల దాడి... వాహనాల ద్వంసం
By: Tupaki Desk | 1 Nov 2022 12:33 PM GMTఅనుకున్నంతా అవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కాదు కానీ మూడు నెలలుగా వాతావరణం పూర్తిగా వేడెక్కింది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ముగ్గులోకి దిగి హీటెక్కించేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అది కాస్తా మరింతగా ముదిరింది. చివరికి మునుగోడు లో చివరి రోజు ప్రచారం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. క్లైమాక్స్ లో యాక్షన్ సీన్లు చోటు చేసుకోవడంతో మునుగోడులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పలివెలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చిన టీయారెస్ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లదాడికి దిగడంతో టోటల్ వాతావరణం మారిపోయింది. రాళ్ళు, కర్రలతో ఈటెల ప్రచార వాహనాన్ని టీయారెస్ కార్యకర్తలు ద్వంసం చేశారు. ఈటెల కాన్వాయ్ లో పలువురికి గాయాలు అయ్యాయి. దాంతో ఈటెల ప్రచారం చేయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.
నిజానికి చూస్తే మునుగోడులో పరిస్థితి వేడెక్కి ఉందని, ఏ క్షణం అయినా అది భగ్గుమంటుందని, ఆందోళలనకు ఆస్కారం ఉంటే ఇలాంటి సీన్లు ఉంటాయని పోలీసులకు తెలిసినా కంట్రోల్ చేసే చర్యలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్న ముందుకు వస్తోంది. టోటల్ గా చూస్తే పోలీసులు పరిస్థితులను అదుపు చేయడంతో విఫలం అయ్యారనే అంటున్నారు.
అయితే దీని మీద బీజేపీ నాయకులు మాత్రం టీయారెస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి తమ పార్టీ మీద చేయించిన దాడిగా ఆరోపించారు. ఓటమి తధ్యమని భావించే ఈ విధంగా టీయారెస్ వారు దాడులకు తెగబడుతున్నారని అంటున్నారు. టీయారెస్ ఇంతటి దుర్మార్గాలకు దిగుతూంటే పోలీసులు చోధ్యం చూశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
పోలీసులు పూర్తిగా అధికార టీయారెస్ కి కొమ్ము కాస్తున్నారని విమర్శిస్తునారు. ఎన్నికల్లో తమ పార్టీ ప్రచారం చేసుకోనీయకుండా చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని కూడా ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా దీని సీరియస్ గా తీసుకుంది అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దాడులను ఖండించారు. టీయారెస్ దుర్నీతి ఇదంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి చూస్తే మునుగోడు క్లైమాక్స్ లో ఇలాంటి యాక్షన్ సీన్లు ఉంటాయని ఊహించినదే ఇపుడు నిజమయింది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.