Begin typing your search above and press return to search.
ఏపీలో కొత్త సిత్రం.. బీజేపీ వర్సెస్ వైసీపీ..ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 9 Aug 2021 11:38 AM GMTగతానికి భిన్నమైన పరిణామాలు ఇటీవల కాలంలో ఏపీలో కనిపిస్తున్నాయి. ఏపీ అధికారపక్షంపై ఏపీ బీజేపీ నేతలు చూసిచూడనట్లుగా వ్యాఖ్యలు చేసేవారు. అందుకు భిన్నంగా కొద్ది నెలలుగా మార్పు వస్తే.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా హాట్ విమర్శలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఏపీలోని జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి బీజేపీ నేతలు గళం విప్పిన వెంటనే.. ఇప్పటివరకు మరే పార్టీ నేతలు తీసుకురానట్లుగా.. కేంద్రం చేస్తున్న అప్పుల మాటేమిటంటూ ఇచ్చిన కౌంటర్ కమలనాథుల్ని ఖంగుతినేలా చేసింది. దానికి వారు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఏపీ సర్కారు తమపై లేనిపోని నిందలు వేస్తుందంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో తమను టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. ఒకరి తర్వాత ఒకరు.. ఏపీ సర్కారు మీద వివిధ అంశాల మీద విరుచుకుపడటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం లేనిపోని నిందలు వేస్తుందని విరుచుకుపడ్డారు.
మంత్రి పేర్ని నాని ఇటీవల మాట్లాడుతూ.. దేశాన్ని బాబాలు పాలిస్తున్నారంటూ విమర్శలు చేయటం దారుణమన్న ఆయన.. కేంద్రం మీద నిందలు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించారు. హిందుత్వాన్ని అవమానిస్తూ ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా? అని ఆయన వేసిన ప్రశ్న వైసీపీ నేతలకు సూటిగా తగిలేలా వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీలో పర్యటిస్తున్న వేళ.. బీజేపీని.. కేంద్రంలోని మోడీ సర్కారుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఆయన తప్పు పట్టారు.
'కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నేతలు విమర్శలు చేయటమా? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి?' అని జీవీఎల్ ప్రశ్నించారు.ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అమ్ జాద్ భాషా టిప్పు సుల్తాన్ భజన ఎందుకు చేస్తున్నట్లు? అని నిలదీశారు. ఇదంతా ఓటబ్యాంకు కోసం చేస్తున్న రాజకీయాలుగా ఉన్నాయని ఆయన తప్పు పట్టారు. పబ్లిక్ ప్లేస్ లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టుకోవటానికి వీల్లేదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణిని స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి పరోక్ష హెచ్చరిక చేశారు జీవీఎల్. ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని.. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల మీద కేంద్రం జోక్యం చేసుకోదని.. కాకుంటే పరిస్థితులు గాడి తప్పితే మాత్రం తప్పనిసరిగా జోక్యం చేసుకుంటుందన్నారు. ఏపీలో అసలైన ప్రతపక్షంబీజేపీనేనని తేల్చి చెబుతున్న ఆయన.. టీడీపీకి వైసీపీకి మధ్య ఏదైనా రహస్య సంబంధం ఉందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేయటం విస్మయానికి గురి చేస్తోంది. ఏపీ మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్న జీవీఎల్. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రం ఇచ్చిన వరాల్ని కాస్త వివరిస్తే బాగుంటుందేమో?