Begin typing your search above and press return to search.

రాజకీయ వర్గాలకు షాకిచ్చిన త్రిపుర బీజేపీ

By:  Tupaki Desk   |   15 Nov 2015 6:40 AM GMT
రాజకీయ వర్గాలకు షాకిచ్చిన త్రిపుర బీజేపీ
X
దీర్ఘకాలంగా మిత్రులుగా ఉన్న వారిని దూరం చేసుకుంటూ ఎంత నష్టమన్న విషయం బీజేపీకి ఇప్పుడు బాగానే అర్థమైన పరిస్థితి. తమ పాత్ర మిత్రుడైన నితీశ్ తో ఉన్న ఇగో సమస్యలతో..బీహార్ ఎన్నికల్లో తనదైన కూటమి ఒకటి ఏర్పాటు చేసుకొని నితీశ్ కు షాక్ ఇవ్వాలని కమలనాధులు భావిస్తే.. బీహారీలు బీజేపీకి షాకివ్వటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గెలుపోటములపై బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలన్న రీతిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి త్రిపుర బీజేపీ నేతల వ్యాఖ్యలే నిదర్శనంగా చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఒకరంటే ఒకరికి పడని కాంగ్రెస్ తోకలిసి పోటీ చేయాలన్న మాట బీజేపీ నేతల నోటి రావటం ఇప్పుడు ఆసక్తికరగా మారింది. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియండి కాదు. కానీ.. అందుకు భిన్నంగా త్రిపుర కమలనాథులు ఓ వెరైటీ ఆపర్ ను కాంగ్రెస్ నేతల ముందు ఉంచారు.

త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేద్దామన్న ప్రతిపాదనను చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. వామపక్షాలు బలంగా ఉన్న త్రిపురలో తమ సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీకి కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగితే విజయం పక్కా అని భావిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ తాజా ఆఫర్ చేసింది. ఉప్పునిప్పులా ఉండే పార్టీల మధ్య వచ్చిన ఈ ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చను రేకెత్తిస్తోంది. మరి.. బీజేపీ నేతల ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.