Begin typing your search above and press return to search.

కేసీఆర్ - మజ్లిస్ లపై బీజేపీ అస్త్రమిదే..

By:  Tupaki Desk   |   9 Jun 2019 12:09 PM GMT
కేసీఆర్ - మజ్లిస్ లపై బీజేపీ అస్త్రమిదే..
X
కొబ్బరి చిప్ప కోసం పిల్లి.. పిల్లి తగవులాడుకుంటే మధ్యలో కోతి వచ్చి ఎత్తుకుపోయిందట.. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అలాగే ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి టీఆర్ఎస్ పెద్దగా శ్రమ పడలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వచ్చి టీఆర్ ఎస్ లో చేరడంతో ఇక చేసేదేం లేక కాంగ్రెస్ పార్టీని టీఆర్ ఎస్ లో విలీనం చేసింది టీఆర్ ఎస్..

ఇప్పుడు సీఎల్పీ విలీనం కాగానే తెలంగాణ అసెంబ్లీలో వాళ్ల స్థానంలోకి తమను తీసుకోవాలని.. ప్రధాన ప్రతిపక్షంగా తమను గుర్తించాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో కేసీఆర్ సర్కారును కోరారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. మజ్లిస్ కు ఏడుగురు ఉన్నారని... అందుకే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాను తమకు ఇవ్వాలని అసద్ డిమాండ్ చేశారు.

అయితే కేసీఆర్-అసద్ స్నేహగీతం ఆలపిస్తుండడంతో ఈ ప్రతిపక్ష హోదాను మజ్లిస్ కు ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.. అయితే ఈ పరిణామాన్ని అనువుగా చేసుకొని లాభపడాలని బీజేపీ తాజాగా స్కెచ్ గీసినట్టు సమాచారం..

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాను టీఆర్ ఎస్.. మజ్లిస్ కు గనుక ఇస్తే.. దాన్ని అస్త్రంగా మలిచి హిందుత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి బీజేపీ సిద్ధంగా ఉందట.. ప్రధానంగా బీజేపీ హిందుత్వ - జాతీయ వాదాన్ని బేస్ చేసుకొని ఓట్లు సంపాదిస్తోంది. హైదరాబాద్ లో మజ్లిస్ కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తోంది. తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచింది ఇలానే.. ఇప్పుడు కేసీఆర్ గనుక మజ్లిస్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే వెంటనే దీన్ని రాజకీయం చేసి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా బలపడాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్లాన్ చేస్తున్నారట.. మరి ఇప్పటికే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని తన రాజకీయ ఎత్తులతో చిత్తు చేశాడు. మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీని ఎలా కంట్రోల్ చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.