Begin typing your search above and press return to search.
కంగనాతో దోస్తీకి బీజేపీ అటునుండి ప్రయత్నాలు?
By: Tupaki Desk | 12 Sep 2020 5:45 AM GMTబాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు ఉన్న స్టార్ డంను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ వర్గాల ద్వారా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో బీజేపీ మద్దతుగా నిలుస్తుందట. శివసేన కార్యకర్తల నుండి ఆమెకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా కేంద్ర హోం శాఖ ఆమెకు వై కేటగిరి భద్రతను కల్పించిన విషయం తెల్సిందే. తన కూతురు భద్రత కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం వై కేటగిరి సెక్యూరిటీ ఇవ్వడం పట్ల ఆశా రనౌత్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకప్పుడు తాము కాంగ్రెస్ మద్దతుదారులం అయినా కూడా ఇప్పుడు బీజేపీ మద్దతుదారులం అంటూ ఆమె నోటి నుండి స్వయంగా మాట వచ్చింది. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆశా రనౌత్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆమె పార్టీలోకి వస్తే తప్పకుండా కీలకమైన పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కంగనాను బీజేపీ నాయకత్వం చాలా కీలకంగా భావిస్తుందని ఆమె ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. కాని అధికారికంగా మాత్రం కంగనా ఎక్కడ కూడా బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదు.
ఆమె మద్దతును పొందాలంటే ఆమె తల్లి అయిన ఆశా రనౌత్ కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే అధిష్టానం సూచన మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆశా రనౌత్ కు ఆఫర్ ఇచ్చారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆఫర్ కు ఆశా రనౌత్ నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. బీజేపీ నాయకుల ఆహ్వానాన్ని గౌరవించి ఆశా రనౌత్ ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా కంగనా బీజేపీ చెంతకు చేరినట్లే అంటున్నారు.