Begin typing your search above and press return to search.

బీజేపీకి ట్రిపుల్ త‌లాఖ్ ఖాయ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   8 Jan 2017 4:41 PM GMT
బీజేపీకి ట్రిపుల్ త‌లాఖ్ ఖాయ‌మ‌ట‌
X
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీపై విమ‌ర్శ‌ల జోరు పెరిగిపోయింది. రాబోయే యూపీ ఎన్నిక‌ల‌తో బీజేపీకి ట్రిపుల్ త‌లాఖ్ పూర్త‌వుతుంద‌ని సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. సీపీఎం మూడు రోజుల సెంట్ర‌ల్ క‌మిటీ స‌మావేశం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... ఇప్ప‌టికే బీహార్ - ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన బీజేపీకి యూపీతో ట్రిపుల్ త‌లాఖ్ పూర్త‌వుతుంద‌ని సెటైర్ వేశారు. అన్ని లౌకిక‌వాద శ‌క్తులు క‌లిసి బీజేపీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని ఏచూరి పిలుపునిచ్చారు.

కుల‌మ‌తాల ఆధారంగా ఓట్లు అడ‌గ‌కూడ‌ద‌ని ఈ మ‌ధ్యే సుప్రీంకోర్టు ఆదేశించినా.. బీజేపీ మాత్రం యూపీలో మ‌త అంశాల‌ను తెర‌పైకి తెస్తోంద‌ని సీతారాం ఏచూరి ఆరోపించారు. యూనిఫాం సివిల్ కోడ్‌ - ట్రిపుల్ త‌లాఖ్ అంశాల‌ను బీజేపీ-ఆరెస్సెస్ అందుకే మ‌రోసారి తెర‌పైకి తెచ్చింద‌ని ఏచూరి విమ‌ర్శించారు. 'ఈ దేశంలో బీజేపీ చేసిన ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మ‌రెవ‌రూ చేయ‌లేదు. హిందువుల ఓటు బ్యాంక్ నిలుపుకోవ‌డం కోస‌మే ఇదంతా. అందుకే వాళ్లు ట్రిపుల్ త‌లాఖ్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు' అని ఏచూరి ఆరోపించారు. మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఢిల్లీలో తొలి త‌లాఖ్‌ - బీహార్‌ లో రెండో త‌లాఖ్ ఎదుర‌య్యాయ‌ని, ఇప్పుడు యూపీతో అస‌లు ట్రిపుల్ త‌లాఖ్ అంటే ఏంటో బీజేపీకి తెలిసి వ‌స్తుంద‌ని అన్నారు. ఆ పార్టీల నేత‌ల వ్యాఖ్య‌లు కూడా త‌మ పార్టీకి త‌లాఖ్ ఇవ్వండ‌నే రీతిలో ఉన్నాయ‌ని ఏచూరి ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/