Begin typing your search above and press return to search.
గుజరాత్ మళ్లీ కమలానిదే..కానీ షాక్ ఖాయం
By: Tupaki Desk | 11 Nov 2017 4:45 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ ఎన్నికలపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. గుజరాత్ శాసనసభకు డిసెంబర్ 9 - 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో కీలక సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. బీజేపీ ఆరోసారి అధికారంలోకి రానుందని ఏబీపీ-సీఎస్ డిఎస్ సర్వే ప్రకటించింది. అయితే ఈ సారి బీజేపీ ఓట్ల వాటా బాగా తగ్గుతుందని సర్వే తెలిపింది. బీజేపీకి 113 నుంచి 121 సీట్లు వస్తాయని వివరించింది. కాంగ్రెస్ కు 58 నుంచి 64 వరకు సీట్లు లభించే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.
ఏబీపీ-సీఎస్ డీఎస్ అక్టోబర్ నెలాఖరులో ఈ సర్వే చేసింది. గత ఆగస్టులో చేసిన సర్వే అంచనాలతో పోలిస్తే అక్టోబర్ సర్వే అంచనాలు బీజేపీకి కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆగస్టులో జరిపిన సర్వేలో బిజెపి సీట్లు గతంతో పోలిస్తే కొంత పెరగవచ్చునని అనిపించిందని, అయితే అక్టోబర్ సర్వేలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సర్వే నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. 2012లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 48 శాతం ఓట్లతో 116 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 38 శాతం ఓట్లతో 60 సీట్లు దక్కించుకుంది. ఇవే సంస్థలు ఆగస్టులో జరిపిన సర్వేలో బీజేపీకి 59 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నట్లు చెప్పాయి. రెండు నెలల విరామం తరువాత అంటే అక్టోబర్ ఆఖరు వారంలో జరిపిన సర్వే ప్రకారం బీజేపీకి 47 శాతం ఓట్లు లభించవచ్చునని అంచనా వేశారు. బీజేపీకి లభించే ఓట్ల శాతం మరో రెండు శాతం తగ్గే పక్షంలో ఆ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య వందకు తగ్గవచ్చునని అంటున్నారు.
ఆగస్టులో జరిపిన సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 29 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలు సూచించగా తాజా సర్వే ప్రకారం ఆ పార్టీకి 41 శాతం ఓట్లు లభించవచ్చు. ఈ లెక్కన గత ఆగస్టు సర్వేతో పోలిస్తే అక్టోబర్ సర్వేలో కాంగ్రెస్ ఓట్ల శాతం ఒకేసారి 12 శాతం పెరగటం గమనార్హం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో విస్తృతంగా పర్యటించటంతోపాటు పటేల్ వర్గం - బిసి - ఆదివాసీలను కలుపుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి మంచి ఫలితాలను వచ్చేందుకు అవకాశాలున్నాయని అంచనా. కాంగ్రెస్ ప్రధానంగా సౌరాష్ట్ర - కచ్ - ఉత్తర గుజరాత్ లో బాగా పుంజుకుంటున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. సౌరాష్టల్రో కాంగ్రెస్ - బీజేపీ 42 శాతం ఓట్లతో నువ్వా - నేనా అన్నట్లు పోటీ పోటీగా ముందుకు సాగుతున్నాయి. ఉత్తర గుజరాత్ లో బీజేపీ కంటే కాంగ్రెస్ ఏడు శాతం ఓట్ల ఆధిక్యతతో ఎంతో ముందుంది.
సౌరాష్ట్ర - ఉత్తర గుజరాత్ లో మొత్తం 107 సీట్లున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉండటం బీజేపీని కలవరపెడుతోందని అంటున్నారు. కాంగ్రెస్ కు మధ్య గుజరాత్ లో గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి గతంలో ఇక్కడ కాంగ్రెస్ ఎంతో పటిష్టంగా ఉండేది. ఒకప్పుడు పటిష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలహీనపడటం వలన బీజేపీకి బాగా కలిసివస్తుందని సర్వే అంచనా వేసింది. మధ్య గుజరాత్ లో కాంగ్రెస్ పై బీజేపీకి 16 శాతం అధిక్యత ఉన్నట్లు సర్వే సూచిస్తోంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు 33 శాతం ఓట్లు లభిస్తే బిజెపికి 51 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా గుజరాత్ లో పెద్ద నోట్ల రద్దు - జిఎస్ టి అమలు అధికార బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వే పేర్కొంది. రాష్ట్రంలోని మెజారిటీ వ్యాపారస్తులు బీజేపీకి ఓటు వేయకపోవచ్చని సర్వే స్పష్టం చేసింది.