Begin typing your search above and press return to search.

ఆ సీఎం త‌ల న‌రికి తెస్తే 11ల‌క్ష‌ల‌న్న బీజేపీ నేత‌

By:  Tupaki Desk   |   12 April 2017 6:22 AM GMT
ఆ సీఎం త‌ల న‌రికి తెస్తే 11ల‌క్ష‌ల‌న్న బీజేపీ నేత‌
X
న‌చ్చ‌ని వారి ప‌ట్ల‌.. వారు తీసుకునే నిర్ణ‌యాల ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. ఇష్టారాజ్యంగా ప్ర‌క‌ట‌న‌లు చేసే అతివాద ధోర‌ణి ఈ మ‌ధ్య‌న బీజేపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న అవ‌స‌రం లేకున్నా.. ద‌క్షిణాది.. ఉత్త‌రాది అంటూ పైత్యం ప్ర‌ద‌ర్శించిన బీజేపీ మాజీ ఎంపీ ఎపిసోడ్ మ‌ర్చిపోక ముందే.. తాజాగా భార‌తీయ జ‌న‌తా యువ మోర్చా నేత ఒక‌రు చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది. దేశంలో ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు కూడా చేస్తారా? అన్న సందేహం క‌లిగేలా అత‌ని వ్యాఖ్య‌లు ఉన్నాయి.

నిత్యం నీతులు చెబుతూ.. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో.. ఆ పార్టీ నేత‌లు కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విస్మ‌యానికి గురి చేస్తుంది. తాము కోరిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌న్న కోపం ఉండ‌టం త‌ప్పేం లేదు. కానీ.. ఆ పేరిట ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ప‌శ్చిమ‌బెంగాల్‌ లో తృణ‌మూల్‌ కు.. బీజేపీ నేత‌ల‌కు మ‌ధ్య‌న న‌డిచే పంచాయితీ తెలిసిందే. తాజాగా భార‌తీయ జ‌నతా యువ మోర్చా నేత ఒక‌రు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌ల న‌రికి తీసుకొస్తే రూ.11 ల‌క్ష‌లు న‌జ‌రానాగా ఇస్తాన‌ని వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

మంగ‌ళ‌వారం హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ప‌శ్చిమ‌బెంగాల్ లోని బీర్బ‌మ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అయితే.. ర్యాలీల‌కు.. స‌మావేశాల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌టం కుద‌ర‌ద‌ని చెప్పిన అధికారుల మాట‌ను హ‌నుమాన్ జ‌యంతి నిర్వాహ‌కులు ప‌ట్టించుకోలేదు. తాము అనుకున్న‌ట్లే ర్యాలీని నిర్వ‌హించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టం.. ఆందోళ‌న‌కారుల్ని నిలువ‌రించే ప్ర‌య‌త్నంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

అధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు సైతం అధికారులు అనుమ‌తి ఎందుకు ఇవ్వ‌ర‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. ర్యాలీలో పాల్గొన్న భ‌క్తుల‌పై లాఠీ ఛార్జ్ చేస్తారా? అంటూ అగ్గి ఫైర్ అయ్యారు బీజేపీ నేత‌లు. వీరికి న‌ల‌భై ఆకులు ఎక్కువ చ‌దివిన బీజేవైఎం నేత యోగేశ్ వ‌ర్ష‌నీ ఊహించ‌ని రీతిలో తాలిబన్ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.సీఎం త‌ల న‌రికి తెచ్చిన వారికి రూ.11ల‌క్ష‌లు బ‌హుమ‌తి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. శ్రీరామ‌న‌వ‌మి.. హ‌నుమాన్ జ‌యంతి రోజుల్లో పూజ‌లు చేసుకునేందుకు ఎందుకు అనుమ‌తించ‌రని ప్ర‌శ్నిస్తూ.. వారు అడ్డుకున్నా తాము కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటే త‌మ‌ను తీవ్రంగా కొడుతున్నార‌ని మండిప‌డ్డారు. ముస్లింల‌కుమ‌ద్ద‌తు ఇచ్చి.. ఇఫ్తార్ విందులు చేస్తారు కానీ.. తాము నిర్వ‌హించుకునే ప‌ర్వ‌దినాల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌రా? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా యోగేశ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/