Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసు.. ఎక్సైజ్ ఆఫీస్ ముట్ట‌డి

By:  Tupaki Desk   |   15 July 2017 5:54 PM GMT
డ్ర‌గ్స్ కేసు.. ఎక్సైజ్ ఆఫీస్ ముట్ట‌డి
X
ఓవైపు డ్ర‌గ్స్ కేసును డీల్ చేస్తున్న అకున్ స‌బ‌ర్వాల్ ను సెల‌వు మీద పంపిస్తున్నార‌న్న వార్త‌లు.. మ‌రోవైపు డ్ర‌గ్స్ రాకెట్లో మ‌రింత‌మంది సినీ ప్ర‌ముఖుల ప్ర‌మేయం ఉన్న‌ప్ప‌టికీ వాళ్ల పేర్ల‌ను దాచేసి.. కేసు నుంచి త‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం.. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాల‌యాన్ని బీజేవైఎం కార్యకర్తలు శనివారం ముట్ట‌డించారు.

ఎక్సైజ్‌ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించిన బీజేవైఎం కార్య‌క‌ర్త‌లు తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని వారు ఆరోపించారు.వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

మాద‌క ద్ర‌వ్యాలు వాడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన 12 మందికి నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఐతే పోలీసుల విచార‌ణ‌లో సినీ కుటుంబాల‌కు చెందిన మ‌రింద‌రు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని.. దాదాపు 15 మంది పేర్ల‌ను అధికారులు దాచేశార‌ని.. కొంద‌రు ప్ర‌ముఖులు ప్రభుత్వ పెద్దలతో తెరవెనుక మంతనాలు జరిపి.. తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త ప‌డుతున్నార‌ని ఆరోపణలు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఈ కేసును ప‌ర్యవేక్షిస్తున్న అధికారి అకున్ స‌బ‌ర్వాల్ మీద విప‌రీత‌మైన ఒత్తిడి వ‌స్తున్న‌ట్లుగా కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.