Begin typing your search above and press return to search.

క‌రోనా త‌ర్వాత‌.. బ్లాక్ ఫంగ‌స్ : నిర్ల‌క్ష్యంగా ఉంటే ప్రాణాల‌కే ముప్పు..

By:  Tupaki Desk   |   11 May 2021 1:30 AM GMT
క‌రోనా త‌ర్వాత‌.. బ్లాక్ ఫంగ‌స్ :  నిర్ల‌క్ష్యంగా ఉంటే ప్రాణాల‌కే ముప్పు..
X
రోనా విల‌యం ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌స్థాయిలో భ‌య‌పెడుతోంది. క‌రోనా సోకిన వారు బ‌తుకుతారో.. లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా నెల‌కొంది. అయితే.. ఎవ‌రైనా.. క‌రోనా నుంచి కోలుకున్నా.. అత్యంత అప్ర‌మ త్తంగా ఉండాల‌ని అంటున్నారు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ శాస్త్ర‌వేత్త‌లు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత.. బాధితుల్లో `బ్లాక్ ఫంగ‌స్‌` క‌నిపిస్తోంద‌ని.. ఇది కంటి చూపు స‌హా.. అనేక అవ‌య‌వాల‌ను బ‌ల‌హీన ప‌రుస్తూ.. బాధితుడి ప్రాణాల‌ను సైతం క‌బ‌ళించే స్థాయికి చేరుకుంటుంద‌ని ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

బ్లాక్ ఫంగ‌స్ అంటే..
బ్లాక్‌ ఫంగస్‌.. అంటే ‘మ్యూకోర్‌మైకోసిస్‌’. ఇది ఒక వ్యాధిగా ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. తాజాగా కోవిడ్‌ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకో ర్‌’ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితే ప్రాణాపాయం తప్పదు అంటున్నారు ఐసీఎంఆర్‌ నిపుణులు. మ్యూకోర్‌మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందన్నారు వైద్యనిపుణులు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.

అంటు వ్యాధి కాదు!

అయితే.. క‌రోనా సోకిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి క‌నిపించినా.. అది క‌రోనా మాదిరిగా అంటు వ్యాధి కాద‌ని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. కేవ‌లం వ్యాధి సోకిన వ్య‌క్తికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది కంటి చూపు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించేలోపే వారి జీవితాలు అంధకారం అయ్యాయి. వీరు చూపు కోల్పోవడానికి కారణం బ్లాక్‌ ఫంగస్ అని నిపుణులు గుర్తించారు. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను గుర్తించారు.

ఇలా గుర్తించాలి!

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్‌-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్‌ లెవల్స్‌ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని అనుమానించాలి. ఇదే విష‌యాన్ని ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇవీ మార్గ‌ద‌ర్శ‌కాలు..

తాజాగా దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరుగుతండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. దీని లక్షణాలు, తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపారు.
+ షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవాలి.
+ ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించుకోవాలి.
+ డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి.
+ ఆక్సిజన్‌ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి.
+ డాక్టర్ల సూచన మేరకు యాంటీబయోటిక్స్‌, యాంటీఫంగల్‌ ఔషధాలను వాడాలి.

ఎవ‌రికి ముప్పు?!

+ డయాబెటిక్ రోగులకు
+ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు
+ క్యాన్సర్, హెచ్ఐవీ రోగులకు