Begin typing your search above and press return to search.
బ్లాక్ ఫంగస్ : 7వేల కేసులు..219 మరణాలు !
By: Tupaki Desk | 22 May 2021 1:30 PM GMTదేశంలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగానే , బ్లాక్ ఫంగస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బ్లాక్ ఫంగస్ విజృంభణ రోజురోజుకి పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్ మైకోసిస్ తో 219 మంది మృతి చెందారు. నిన్నమొన్నటి వరకు కరోనా విజృంభించిన మహారాష్ట్ర, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అటు గుజరాత్ లో కూడా దాదాపు అదే పరిస్థతి. ఇక , బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా గుర్తించాయి. ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ ను ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్‌ప్రకారం నోటిఫయబుల్ డిసీజ్ వర్గీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఇప్పటివరకు 15 వందల మందికి సోకగా, అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ లో 15 వందల మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ఇక రాజస్తాన్ లో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటివరకు 400 మంది కంటిచూపు కోల్పోయారు. కేవలం జైపూర్ లోనే 148 మందికి సోకింది. జోధ్‌పూర్ లో 100 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య 300 దాటింది. పరిస్థితి అదుపుతప్పేలా ఉండడంతో మూడు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసింది కేజ్రీవాల్ సర్కార్. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కోఠి ఈఎన్ టి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స అందిస్తోంది ప్రభుత్వం. ఈఎన్ టి హాస్పటిల్‌కు మొదట్లో 50 బెడ్లలో మాత్రమే చికిత్సలకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మొత్తం 202 బెడ్లను బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వినియోగించేందుకు సిద్ధమైంది. ఈఎన్ టి ఆసుపత్రిలో 90 మంది చికిత్స తీసుకుంటున్నారు.