Begin typing your search above and press return to search.
విశాఖలో విజృంభిస్తోన్న బ్లాక్ ఫంగస్ ..
By: Tupaki Desk | 2 Jun 2021 4:30 PM GMTఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. కరోనా బారినపడి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ శాపంలా మారుతోంది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి సంఖ్య వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన రెండు రోజుల్లో మరో 20 మంది బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్‌లో చేరారు. వారికి వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు అధికారులు. జిల్లాలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువలో వుంది. వీరందరికీ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
నగర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 113 మంది బాధితులు చికిత్స పోతున్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ మందుల కొరత లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మొత్తం 94 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెల్లడించింది. బ్లాక్ ఫంగస్ సోకిన బాధితులకు విశాఖ కేజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో కూడా ఆరోగ్య శ్రీ కింద బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యం అందించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా చికిత్సకు ఆరోగ్య శ్రీ కింద 50శాతం బెడ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘింస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైద్యాధికారి హెచ్చరించారు.