Begin typing your search above and press return to search.
స్ట్రెయిన్ల ప్రభావంతోనే బ్లాక్ ఫంగస్ !
By: Tupaki Desk | 12 Jun 2021 12:30 AM GMTకరోనా క్రమక్రమంగా తగ్గుతుంది , ఇక మంచి రోజులు రాబోతున్నాయి అని అనుకునే సమయంలోనే బ్లాక్ ఫంగస్ విజృంభణ ఆందోళనకి గురిచేస్తుంది. కరోనా సోకి తగ్గిన వారిలో ఈ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తోంది. మనదేశంలో ఈ ఫంగస్ రెండోదశలో పంజా విసురుతున్నది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. కొంతమంది కి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత సోకుతుండగా, మరికొందరికి పాజిటివ్ ఉండగానే ఈ ఫంగస్ సమస్య తలెత్తుతున్నది. మొన్నటివరకు అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం, ఆక్సిజన్ పై ఎక్కువకాలం చికిత్స పొందడం, షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోవడం వంటి ప్రధాన కారణాలతోనే ఈ బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్లు చాలామంది వైద్యులు, అధ్యయనాలు, సర్వేలు వెల్లడించాయి.
కానీ, తాజా అధ్యయనంలో అవన్నీ బ్లాక్ ఫంగస్ కు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. అంతేకాదు ఆక్సిజన్, షుగర్ స్థాయిలు అధికంగా ఉన్నవారికే ఈ ఫంగస్ సోకుతుందన్న వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నారు. కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ తీసుకోని చాలామంది రోగులు కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్లు నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఆక్సిజన్ వరకు వెళ్లనివారితోపాటు ఇప్పటివరకు అసలు షుగర్ లేనివారికి కూడా ఈ ఫంగస్ సోకుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎసింప్టమాటిక్, స్వల్ప లక్షణాలతో హోం ఐసొలేషన్ లో ఉన్నవారు కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్లు గాంధీ వైద్యులు వెల్లడించారు. స్టెరాయిడ్స్, షుగర్ లెవల్స్, ఆక్సిజన్ వాడకంతో బ్లాక్ ఫంగస్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు.
గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్లాక్ ఫంగస్ రోగుల్లో 20 శాతం మంది ఎలాంటి స్టెరాయిడ్స్ వాడనివారే. అంతేకాదు పాజిటివ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ వరకు వెళ్లకుండా స్వల్ప లక్షణాలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు కూడా ఉన్నారు. షుగర్ సమస్యలు లేనివారు కూడా ఈ ఫంగస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ లో వస్తున్న కొత్త స్ట్రెయిన్ ల ప్రభావమే బ్లాక్ ఫంగస్ కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి స్టెరాయిడ్స్ వాడని వారు, ఆక్సిజన్ పై చికిత్స తీసుకోనివారు, షుగర్ సమస్య లేనివారు, హోం ఐసొలేషన్ లో ఉన్నవారికి కూడా ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుంది. కరోనా మొదటిదశలో చాలామంది రోగులకు స్టెరాయిడ్స్ వాడాం. రోజుల తరబడి ఆక్సిజన్ పై చికిత్స అందించాం. అప్పుడు ఏ ఒక్కరికి బ్లాక్ ఫంగస్ సోకలేదు. ఈ ఫంగస్ కేవలం సెకండ్ వేవ్ లోనే కనిపిస్తున్నదని, ఈ ఫంగస్ పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు.