Begin typing your search above and press return to search.
అపరిశుభ్ర మాస్కులతో బ్లాక్‌ఫంగస్.. జర పైలం..!
By: Tupaki Desk | 23 May 2021 3:30 AM GMTకరోనా ఎఫెక్ట్ తో మాస్కు మన జీవితంలో భాగమైపోయింది. మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా జనం భయపడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ఒక్కమాస్కు పెట్టుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం వైరస్ తీవ్రత పెరగడంతో డబుల్ మాస్కు తప్పనిసరి అని సూచిస్తున్నారు. అంతేకాక ఎన్-95 లాంటి మాస్కులు వాడటం మరీ ఉత్తమం అని సూచిస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ మాస్కులపై అవగాహన వచ్చింది. మాస్కులు లేకుండా ఎవరూ బయటకు రావడం లేదు.
అయితే ఈ మాస్కులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకున్న తర్వాత మాత్రమే వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అపరిశుభ్ర మాస్కులు వాడితే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చాలా మంది మాస్కులను వాష్ చేసుకోకుండా మళ్లీ మళ్లీ వాటినే వాడుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
బ్లాక్‌ఫంగస్ వ్యాధికి అపరిశుభ్ర మాస్కులు వాడటం కూడా ఓ కారణం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్న వారికి ఇటీవల మ్యుకోరోమైకోసిస్ లేదా బ్లాక్‌ఫంగస్ వస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ ఫంగస్ తో చాలా మంది చనిపోతున్నారు కూడా.. అయితే ఇందుకు కారణం అపరిశుభ్ర మాస్కులు అని డాక్టర్లు అంటున్నారు.
కరోనా వచ్చిన బాధితులు స్టెరాయిడ్స్ వాడటం కూడా బ్లాక్ ఫంగస్ రావడానికి ఓ కారణం. ముఖ్యంగా మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవాళ్లు కరోనా చికిత్స తీసుకున్నప్పుడు వారిలో బ్లాక్‌ఫంగస్ ఎక్కువగా కనిపించింది. దీంతో బ్లాక్‌ఫంగస్ పై వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. మొదట్లో ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన బ్లాక్‌ఫంగస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చేరింది. ఏపీలో అయితే బ్లాక్ ఫంగస్ కేసులు ప్రతి జిల్లాలోనూ నమోదవుతున్నాయి. అయితే అపరిశుభ్ర మాస్క్ లు ధరించి బ్లాక్ ఫంగస్ బారిన పడొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.