Begin typing your search above and press return to search.
అసెంబ్లీల్లో బ్లాక్ మెయిలర్లు
By: Tupaki Desk | 24 Dec 2015 11:42 AM GMTపరమ పవిత్రమైన చట్ట సభల్లో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే వాళ్లు కొలువు తీరాలి. కానీ, ప్రస్తుతం వివిధ శాసన సభల్లో బ్లాక్ మెయిలర్లు కొలువు తీరుతున్నారు. ఆంద్రప్రదేశ్ శాసన సభ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అధికార పక్షాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రతిపక్షం పావులు కదుపుతుంటే, ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తున్నాయని, ఈ క్రమంలో ఇరు పక్షాలూ ఒకరిని మరొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు కాల్ మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. దాంతో ఈ అంశంతో అధికార పక్షాన్ని ఇరుకునపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రతిపక్షం భావించింది. అందుకు రోజా తదితరులను ముందుకు తేవాలని భావించింది. అయితే కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరిగితే తమ పార్టీ నేతలు కూడా అందులో పీకల్లోతు ఇరుక్కున్నందున ఆ చర్చతో తమకే నష్టం జరుగుతుందని అధికార పార్టీ భావించిందని, అందుకే ప్రతిపక్ష నేతలను ఎప్పట్లాగే తమ తమ మాటలతో రెచ్చగొట్టిందని, దాంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు చివరికి కాల్ మనీ విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకుని వాళ్లే బద్నాం అయ్యారని చెబుతున్నారు.
కాల్ మనీ వ్యవహారంతో ఎదురు దెబ్బలు తిన్న ప్రతిపక్ష వైసీపీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి బదులు తీర్చుకోవాలని ప్రతి వ్యూహం పన్నిందని, తద్వారా ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేయాలని భావించిందని, అయితే, అదే బ్లాక్ మెయిల్ ప్రతి వ్యూహంతో అధికార పార్టీ మరో ఎత్తు వేసిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేలా రోజాతోపాటు కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ సహా మరికొంతమందిపైనా వేటు పడే అవకాశం ఉందనే సంకేతాలు ఇవ్వడమే కాదు.. వారిపై సభా హక్కుల తీర్మానం పెట్టడానికి కూడా సిద్ధమైంది. తద్వారా అసెంబ్లీలో బ్లాక్ మెయిల్ అనేది అధికార ప్రతిపక్షాలకు ఒక ఎత్తుగడగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.