Begin typing your search above and press return to search.
తెలుపు చేసేందుకు వ్యవ‘సాయం’ పేరు వాడితే..
By: Tupaki Desk | 15 Nov 2016 4:55 AM GMTపెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోడీ.. వ్యక్తిగతంగా రూ.2.5లక్షల మొత్తం వరకూ వ్యక్తిగతంగా బ్యాంకుల్లో వేసుకోవచ్చని చెప్పిన వైనం తెలిసిందే. ఈ మినహాయింపును ఆసరాగా చేసుకొని అక్రమ మార్గాల్లో నలుపును తెలుపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇలాంటి వాటిని చెక్ చెప్పేందుకు మోడీ సర్కారు పెద్ద ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 10 నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.2.5లక్షల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ అయిన పక్షంలో అలాంటి ఖాతాలపై నిఘా నేత్రం ఉంటుందని చెబుతున్నారు.
పరిమితికి మించిన ప్రతి అకౌంట్ ను ప్రభుత్వం పరిశీలిస్తుందని.. డిపాజిట్ చేసిన వారి సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజాయితీగా సంపాదించిన సొమ్ముకు ఎలాంటి ఇబ్బంది లేదని.. రూ.2.5లక్షల పరిమితికి మించి డిపాజిట్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయితే.. వ్యవసాయం పైన వచ్చే ఆదాయంపై పన్ను లేని నేపథ్యంలో కొందరు.. ఆ పేరుతో నలుపును తెలుపుగా మార్చేందుకు వ్యవ‘సాయం’పేరును వాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇలాంటి వారి ఆటలు కట్టించేందుకు వీలుగా.. వ్యవసాయం పేరు మీద రూ.2.5లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపిస్తూ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న వారి ఖాతాల్నిప్రత్యేకంగా పరిశీలించటంతో పాటు.. వారికి ఉన్న భూమి ఎంత? ఏ పంట వేశారు? ఎంత ఆదాయం వచ్చింది? వచ్చిన ఆదాయానికి..డిపాజిట్ చేసిన మొత్తం ఎంత? లాంటి వాటిని ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. వ్యవసాయం పేరుతో మేనేజ్ చేయాలని చూసినా తిప్పలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. నలుపును తెలుపు చేసే క్రమంలో వ్యవసాయాన్ని సాయంగా చేసుకున్నా తిప్పలు తప్పవన్నట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/