Begin typing your search above and press return to search.
ఏసీబీకి దొరికిన డబ్బు ఏం చేయాలి?
By: Tupaki Desk | 12 Nov 2016 6:31 AM GMTమోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పలు న్యాయపరమైన చిక్కులూ తెచ్చిపెడుతోంది. రాష్ట్రాల స్థాయిలో అవినీతి నిరోధక శాఖ - జాతీయ స్ధాయిలో సిబిఐ.. పోలీసులు వివిధ సోదాలు - దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగదు కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిని కోర్టులోని చెస్ట్ లేదా కోర్టు ఆదేశాల మేరకు తమ కార్యాలయాల చెస్ట్ ల్లో సిబిఐ - ఏసిబి అధికారులు భద్రపరుస్తుంటారు. సాధారణంగా స్వాధీనం చేసుకున్న నగదును కోర్టు భవనాల్లోని చెస్ట్ ల్లో భద్రపరుస్తారు. ప్రస్తుతం కేంద్రం ఐదు వందలు - వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది. సాధారణ ప్రజలు తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకునే వీలుంది. కాని ఏసిబి - సిబిఐలు ఏం చేస్తాయనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 30లోగా వీటిని మార్చుకోకపోతే ఈ నోట్లన్నీ చెల్లని కాగితాలుగా మారుతాయి.
అవినీతికి పాల్పడే రాష్ట్ర ఉద్యోగులను ఏసిబి - కేంద్ర ఉద్యోగులను సిబిఐ పట్టుకుంటుంది. ఒక్కోసారి ఇళ్లలో సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంటారు. ఇదంతా అవినీతి సొమ్ము - నల్లధనం. సాధారణంగా ఒకసారి కోర్టుకు కేసు నివేదించిన వెంటనే ఈ సొమ్ము కోర్టు ఆధీనంలోకి వెళుతుంది. ఇటీవలి కాలంలో అంటే పదేళ్లుగా అవినీతి కేసుల్లో పట్టుబడిన సొమ్ములో సింహభాగం ఐదు వందలు - వెయ్యి నోట్లే. కొన్నిసార్లు కోర్టు ఆదేశంపై నగదును బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖగా పనిచేస్తున్న సిబిఐ - రాష్ట్రంలో ఎసిబి ఆధీనంలో ఉన్న నగదు కోట్లలోనే ఉంటుందని అంచనా. వల పన్ని పట్టుకున్న కేసుల్లో నగదు సాక్ష్యంగా ఉంటుంది. ప్రతి కరెన్సీ నోటు నంబర్ ను చార్జిషీటులో - ఎఫ్ ఐఆర్ లో ప్రస్తావిస్తారు. కోర్టు - ఏసిబి కస్టడీల్లో ఉన్న రద్దయిన నోట్లను నగదుగా మార్చాలంటే న్యాయ స్థానాలు - ప్రభుత్వం అనుమతి అవసరం. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కావాలి. ఈ విషయమై న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నామని ఏసిబి అధికారులు తెలిపారు.
డిసెంబర్ 30వరకు సమయం ఉన్నందు వల్ల ముందుగా తమ ఆధీనంలో - కోర్టు ఆధీనంలో ఉన్న నగదులో రద్దయిన నోట్ల విలువను మదింపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నగదు వివరాలను కోర్టుకు సమర్పించాలి. కోర్టులు - ప్రభుత్వం ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రభుత్వ శాఖలకూ ఈ నల్లధనం వదిలించుకోవడం పెద్ద సమస్యగానే మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/