Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల‌లో అన్ని ల‌క్ష‌ల కోట్ల బ్లాక్ మ‌నీ భార‌త్‌ లోకి..

By:  Tupaki Desk   |   4 May 2017 4:59 AM GMT
ప‌దేళ్ల‌లో అన్ని ల‌క్ష‌ల కోట్ల బ్లాక్ మ‌నీ భార‌త్‌ లోకి..
X
భార‌త్ లో బ్లాక్ మ‌నీ జోరు ఎంత‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బ్లాక్ మ‌నీ స‌ర్వ‌త్రా ఉంటుంద‌న్న విష‌యం తెలిసినా.. ఇదెంత స్థాయిలో ఉంటుంద‌న్న విష‌యాన్ని తాజాగా తెల్లోడు (అమెరికావాడు) లెక్క తేల్చ‌టం గ‌మ‌నార్హం. ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో (2005-2014) వ‌చ్చిన బ్లాక్ మ‌నీని అమెరికాకు చెందిన గ్లోబ‌ల్ ఫైనాన్షియ‌ల్ ఇంటిగ్రిటీ సంస్థ త‌న తాజా నివేదిక‌లో వెల్ల‌డించింది.

ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో భార‌త్‌ లోకి వ‌చ్చిన బ్లాక్ మ‌నీ విలువ దాదాపు రూ.50ల‌క్ష‌ల కోట్ల మేర ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో భార‌త్ నుంచి దాదాపు రూ.10ల‌క్ష‌ల కోట్ల మేర మొత్తం భార‌త్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయి ఉంటుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇల్లిసిట్ ఫైనాన్షియ‌ల్ ఫ్లోస్ టు అండ్ ఫ్ర‌మ్ డెవ‌ల‌పింగ్ కంట్రీస్ 2005-14 అనే శీర్షిక‌త‌తో జీఎఫ్ ఐ నివేదిక‌ను విడుద‌ల చేశారు.

ఈ నివేదిక ప్ర‌కారం 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేశంలోకి సుమారు రూ.6ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దుదేశంలోకి వ‌చ్చి ఉంటుంద‌న్న అంచ‌నా వేశారు. అదే స‌మ‌యంలో రూ.1.5ల‌క్ష‌ల కోట్ల మొత్తం భార‌త్ నుంచి విదేశాల‌కు త‌ర‌లి వెల్లి ఉంటుంద‌ని చెబుతున్నారు.ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో దేశానికి వ‌చ్చిన న‌ల్ల‌ధ‌నం.. మొత్తం దేశ వ్యాపార లావాదేవీల ట‌ర్నోవ‌ర్ లో 14 శాతంగా అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో దేశం నుంచి వెళ్లిపోయిన న‌ల్ల‌ధ‌నం మూడు శాత‌మ‌ని నివేదిక వెల్ల‌డిస్తోంది. బ్లాక్ మ‌నీని గుర్తించేందుకుఅన్ని బ్యాంకులు త‌మ ఖాతాదారుల వివ‌రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/