Begin typing your search above and press return to search.
తప్పు యూనివర్సిటీదా? ఎయిర్ ఇండియాదా?
By: Tupaki Desk | 6 Jan 2016 7:45 AM GMT ఎయిర్ ఇండియా సంస్థపై అమెరికా విశ్వవిద్యాలయం ఒకటి కేసు వేయడానికి రెడీ అవుతోంది. ఎయిర్ ఇండియాకు, ఆ సంస్థకు సంబంధమేమిటా అనుకుంటున్నారా? ఇటీవల భారత విద్యార్తుల విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ అమెరికా యూనివర్సిటీ ఎయిర్ ఇండియాపై మండిపడుతోందట.
భారత అధికారిక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కాలిఫోర్నియాలోని నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ (ఎన్ పియు) పరువునష్టం దావా వేయనుంది. అమెరికా ప్రభుత్వంనుంచి సరైన గుర్తింపులు లేని సంస్థగా ఎన్ పియు గురించి ప్రచారం జరిగింది. అయితే... ఎయిర్ ఇండియా ఇలాటి ప్రచారం చేస్తోందని ఆ విశ్వవిద్యాలయం అంటోంది. దీంతో తమ విశ్వవిద్యాలయం గురించిన తప్పుడు ప్రచారంతో విపరీతమైన నష్టాన్ని కలిగించినందుకు ఎయిర్ ఇండియాపై పరువునష్టం దావాతో సహా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని ఎన్ పియు అధ్యక్షుడు పీటర్ హెయిష్ చెప్పారు. అయితే కేసును అమెరికాలో వేస్తారా లేక భారత్ లో వేస్తారా అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఈ విశ్వవిద్యాలయంలో చేరడానికి వెళుతున్న హైదరాబాద్ విద్యార్థులనేకమందిని తిప్పి హైదరాబాద్ కు పంపించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్ పియు ఎయిర్ ఇండియాపై పరువునష్టం దావా వేయబోతోంది.
అయితే... విద్యార్తులకు కలిగిన ఇబ్బంది విషయంలో సరైన గుర్తింపు లేనిదిగా పేర్కొంటున్న యూనివర్సిటీది తప్పా... తిప్పి పంపిన ఎయిర్ ఇండియాది తప్పా అన్నది తేలాల్సి ఉంది.