Begin typing your search above and press return to search.

ఇలా అయితే.. తెలంగాణ‌లో బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు త‌ప్ప‌వా?

By:  Tupaki Desk   |   27 July 2021 7:41 AM GMT
ఇలా అయితే.. తెలంగాణ‌లో బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు త‌ప్ప‌వా?
X
ఔను! ఇలా అయితే.. తెలంగాణ‌లో మున్ముందు బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు త‌ప్ప‌వ‌నే అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ప్ర‌స్తుతం అధికార పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ అనుస‌రిస్తున్న వైఖ‌రి.. ఈ వాద‌న‌ను బ‌లోపేతం చేస్తోంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన ఉప ఎన్నిక నేప‌థ్యంలో కేసీఆర్ చూపిస్తున్న ప్రేమ‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆయ‌న నైతిక‌త‌నే ప్ర‌శ్నించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఉప ఎన్నిక వ‌చ్చింది క‌నుక ఇక్క‌డ అభివృద్ది నిధులు మంజూరు చేయ‌డం.. ప‌థ‌కాలు ప‌రుగులు పెట్టించ‌డం.. వంటివి కేసీఆర్‌.. నైతిక‌త‌నే ప్ర‌శ్నార్థం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా ఎదుర్కొనాల్సిన ఉప ఎన్నిక‌ను `ప‌థ‌కాలు, పంప‌కాల ఎన్నిక‌`గా మార్చేస్తు న్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఏ ఉప ఎన్నిక వ‌చ్చినా.. అధికార పార్టీనే స‌హ‌జంగా విజ‌యం ద‌క్కించుకుంటుంది. కానీ, తెలంగాణ‌లో ఇంత‌కు ముందు జ‌రిగిన దుబ్బాక ఉప పోరు మాత్రం అధికార పార్టీకి షాకిచ్చింది. ఈ క్ర‌మంలో త‌దుప‌రి వ‌చ్చిన నాగార్జున సాగ‌ర్ ఉప పోరులో ఒకింత జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు.. హుజూరాబాద్‌లో ఉప పోరు విష‌యంలో తెర‌దీసిన విధంగా.. ప‌థ‌కాలు-పంప‌కాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు.

సో.. దీనిని బ‌ట్టి చూస్తే.. హుజూరాబాద్ విష‌యంలో కేసీఆర్ ఆయ‌న పార్టీ నేత‌లు.. భ‌య‌ప‌డుతూ అయినా ఉండాలి. లేక‌.. పార్టీ వీక్ అవుతోంది కాబ‌ట్టి.. పంప‌కాల‌తోనే ప‌ట్టునిలుపుకొనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. ఒప్పుకొ నైనా ఉండాలి. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కేసీఆర్.. వేసే వ్యూహాలు.. ప‌థ‌కాల వెల్లువ‌.. వంటివి మాస్‌ను ఆక ర్షించ‌వ‌చ్చేమో.. కానీ, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని.. ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల‌కు ఆమోద యోగ్యంగా ఏమాత్రం లేవు. ఎందుకంటే.. 2018లో ఎన్నిక‌లు జ‌రిగితే.. 2021 వ‌రకు ద‌ళిత బంధు ఏమైంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. అంతేకాదు.. నిజానికి కేసీఆర్‌కు ఈ ప‌థ‌కాన్ని సంపూర్ణంగా అమ‌లు చేయాల‌నే ల‌క్ష్యం ఉందా? అనేది కూడా ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. కేవ‌లం హుజూరాబాద్ వ‌ర‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని ప‌రిమితం చేయ‌డం.. ఇక్క‌డ ప్ర‌యోగా త్మ‌కంగా.. ప‌రిశీలించిన త‌ర్వాత‌...రాష్ట్ర మంతా అమలు చేసే విష‌యంపై ఆలోచిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం వంటివి.. `బ్లాక్‌మెయిల్‌` పాలిటిక్స్‌గానే ఉన్నాయ‌ని.. అంటున్నారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్నా.. ఎస్సీ లు ఎక్కువగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం.. జిల్లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయొచ్చుక‌దా? అనే ప్ర‌శ్న‌కు టీఆర్ ఎస్ నుంచి స‌మాధానం లేదు. ఇదే విధానం కొన‌సాగితే.. కేసీఆర్‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి త‌గ్గ‌డంతోపాటు.. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు పెరిగే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే ప‌లు సంఘాలు.. త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.