Begin typing your search above and press return to search.
అమెరికా తన గోతిని తానే తీసుకుందా?
By: Tupaki Desk | 23 Jan 2017 4:26 AM GMTతరచూ ప్రపంచ దేశాల మీద పడే అమెరికాకు తన మాటలతో షాకిచ్చారు చైనా వ్యాపార దిగ్గజం అలీబాబా డాట్ కామ్ అధినేత జాక్ మా. ఒక విదేశీ రాజకీయ అధినేతలు సైతం మాట్లాడని విధంగా జాక్ మా అమెరికాపై విమర్శనాస్త్రాల్ని సంధించాడు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితి కారణం.. అమెరికానే కానీ మరెవరూ కాదని స్పష్టం చేశారు. అన్నింటికి మించి ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించిన రీతిలో ఆయన రియాక్ట్ అయ్యారు.
ఇప్పుడున్న అమెరికా పరిస్థితి కారణం అమెరికానే కానీ.. చైనాతో వ్యాపార సంబంధాలు ఎంతమాత్రం కాదని ఆయన తేల్చేశారు. గడిచిన 30 ఏళ్లలో అమెరికా యుద్ధాలపై చేసిన ఖర్చు రూ.952 లక్షల కోట్లుగా ఆయన వెల్లడించారు. ఈ భారీ మొత్తాన్ని అమెరికాలోని మౌలిక సదుపాయాలపై వెచ్చించకుండా యుద్ధాలపై అమెరికా ఖర్చు చేసిందని ప్రకటించారు.
30 ఏళ్ల క్రితం మేథో సంపత్తిపై హక్కులను ఉంచుకొని కార్మిక ఉద్యోగాలను అమెరికా ప్రపంచానికి వదిలేసిందన్న జాక్ మా.. ఈ కారణంతోనే ఐబీఎం.. మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారీ ఆదాయాన్ని సాధించాయన్నారు. అమెరికన్ల ఉద్యోగాల్ని చైనా దొంగలించలేదని చెప్పిన ఆయన.. అమెరికా తనకు తానుగా చేసుకున్న తప్పులతోనే అమెరికన్లకు ఉద్యోగాల కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు. వ్యాపార యుద్ధాన్నిస్టార్ట్ చేయటం తేలికే కానీ.. ముగించటం కష్టమన్న అలీబాబా అధినేత.. ‘అలాంటి యుద్ధం ముగియాలంటే అసలు యుద్ధం ప్రారంభం కావాలి. వ్యాపారం వల్ల ప్రజలు ఆలోచనలు.. సంస్కృతులను పంచుకుంటారు’అని వ్యాఖ్యానించారు. ఏమైనా ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం చేసిన తప్పుల్ని ఒక వ్యాపార అధినేత నిర్మోహమాటంగా తేల్చి చెప్పేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/