Begin typing your search above and press return to search.
ఢిల్లీలోనే వివక్ష.. హైదరాబాద్ లో లేదంట
By: Tupaki Desk | 25 July 2015 5:41 AM GMTపేరుకు దేశ రాజధాని అయినప్పటికీ మత ఛాందసం భారీగా ఉందన్న విషయం మరోసారి నిరూపితం అయ్యింది. పేరుకు మెట్రో అయినప్పటికీ.. ఆ భావన అక్కడి ప్రజల మనసుల్లో లేదన్న విషయం బహిర్గతమైంది.
ముస్లిం మతస్తురాలైన తనకు అద్దె ఇల్లు ఇచ్చేందుకు ఢిల్లీలో ఇవ్వటం లేదని.. తాను ఎనిమిదేళ్లు హైదరాబాద్ లో ఉన్నా అలాంటి పరిస్థితి తానెప్పుడూ ఎదుర్కోలేదంటూ ఒక మహిళా ప్రొఫెసర్ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టికి తీసుకొచ్చారు.
దృష్టి లోపం ఎదుర్కొంటున్న 30ఏళ్ల మహిళా ప్రొఫెసర్ రీమ్ షంషుద్దీన్.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. కేరళకు చెందిన ఆమె.. తాజాగా ఢిల్లీకి వచ్చారు. అయితే.. తాను ఉండేందుకు అద్దె ఇంటి కోసం ప్రయత్నిస్తే..ఒక ఇంటి యజమాని తాను ముస్లిం అన్న కారణంగా తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఇష్టపడలేదని పేర్కొన్నారు.
విశ్వనగరంగా పేర్కొనే ఢిల్లీలో మతం ఆధారంగా ఇంటిని అద్దెకు ఇవ్వటాన్ని నిరాకరించటం తనను విస్మయానికి గురి చేసిందని.. గతంలో తాను హైదరాబాద్ లో ఉన్నా.. ఇలాంటి పరిస్థితి తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని ఆమె పేర్కొన్నారు. తాను ఎదుర్కొన్న వివక్షను ఆమె ఒక వీడియో రూపంలో.. యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. మరి.. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. మత వివక్ష విషయంలో విశ్వ నగరంగా చెప్పుకునే ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్ ఎంతో బెటర్ అన్న సంగతి మరోసారి నిరూపితమైంది. దీనికి.. హైదరాబాదీయులు సంతోషించాల్సిన విషయంగా చెప్పక తప్పదు.