Begin typing your search above and press return to search.
ఆ హ్యాండ్ పంప్ లో దెయ్యం ఉందా?
By: Tupaki Desk | 11 Dec 2019 3:58 AM GMTహర్రర్ సినిమాల్లో కనిపించే సీన్ రియల్ గా కంటి ముందుకు వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా.. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో నెలకొంది. దెయ్యం సినిమాల్లో వాటర్ ట్యాప్ తిప్పితే నీళ్లకు బదులు రక్తం రావటం.. పరుగులు తీయటం లాంటి సీన్ చాలా కామన్. వణికించే ఈ సీన్ నిజంగానే ఎదురైతే ఎలా ఉంటుంది? ఇప్పుడా గ్రామంలోని ప్రజల పరిస్థితి సరిగ్గా ఇలానే ఉందట.
హమీర్ పూర్ పరిధిలోని జాఖోడీ గ్రామంలో వంద ఇళ్లకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఒక హ్యాండ్ పంప్ ను ఏర్పాటు చేసింది.ఏమైందో ఏమో కానీ.. ఈ మధ్యన ఆ హ్యాండ్ పంప్ ను వాడితే చాలు అందులో నుంచి రక్తం.. మాంసం.. ఎముకలు వస్తున్నాయట. విపరీతమైన దుర్వాసతో వస్తున్న వీటిని చూసిన అక్కడి ప్రజలు వణికిపోతున్నారట.
ఈ హ్యాండ్ పంప్ వద్దకు వెళ్లేందుకు సైతం భయపడుతున్నారట. దీంతో.. ఈ విషయం గురించి తెలిసిన అధికారులు.. దాన్ని తెరిచి చూశారట. హ్యాండ్ పంప్ నుంచి రక్తం ఎందుకు వస్తుందో లెక్క తేల్లేదు. అంతా మీ భ్రమ అంటూ కొట్టి పారేశారట. ఎందుకలా జరుగుతుందన్న విషయం మీద క్లారిటీ మాత్రం రాలేదట. ఒకరిద్దరు అధికారులు మాత్రం హ్యాండ్ పంప్ లోపల పాము చనిపోయిందని.. అందుకే అలా జరిగిందని చెబుతున్నా.. గ్రామస్తులు మాత్రం అస్సలు నమ్మట్లేదట. దెయ్యం హ్యాండ్ పంప్ అంటూ వణుకుతున్నారట. దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా సాహసించటం లేదట.