Begin typing your search above and press return to search.
పీరియడ్స్ లో కళ్ల నుంచి రక్తం
By: Tupaki Desk | 20 March 2021 12:30 AM GMTశతకోటి వ్యాధులకు.. అనంతకోటి వైరస్ లంటారు. ఇప్పుడు వ్యవస్థ అలానే పాడైంది. కరోనాలాంటి కొత్త రోగాలు పుట్టుకొచ్చాయి. మనిషికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియడం లేదు. ఇప్పుడో అరుదైన వ్యాధి కారణంగా పీరియడ్స్ లో కళ్ల నుంచి రక్తం కారడం మొదలైంది..
మహిళలకు పీరియడ్స్ సమయంలో యోని నుంచి రక్తస్రావం జరగడం సహజం. కానీ చండీగఢ్ కు చెందిన 25 ఏళ్ల వివాహితకు కళ్ల నుంచి రక్తం కారడం సంచలనమైంది. ఇలా కళ్ల నుంచి రక్తం ఎందుకు కారుతుందో తెలియక ఆమె ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వ్యాధికి గల కారణాలపై పరీక్షలు చేయించుకుంది.
కాగా తాజాగా ఆ సమస్యను వైద్యులు గుర్తించారు. ‘ఆక్యులర్ వికేరియస్ మెన్ స్ట్రుయేషన్’గా గుర్తించారు. ఇది ఒక వింత సమస్యగా వైద్యులు తేల్చారు.
ఈ సమస్య ఉన్నవారికి పీరియడ్స్ టైంలో ఊపిరితిత్తులు, కళ్లు, ముక్కు, పెదవుల నుంచి కూడా రక్తం కారుతుందట.. హర్మోన్లలో వచ్చే మార్పులు రక్తనాళ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని బ్రిటీష్ మెడికల్ జర్నల్ తెలిపింది.
రక్తనాళ వ్యవస్థపై హార్మోన్ల ప్రభావం కారణంగానే ఇది కనిపిస్తుందని.. లక్షల మంది మహిళల్లో ఒకరికి ఇలాంటి అరుదైన హర్మోన్ల లోపం కారణంగా వ్యాధి వస్తుందని వైద్యులు తేల్చారు.