Begin typing your search above and press return to search.

ఈ రోజు చంద్ర‌గ్ర‌హ‌ణాన్ని ఆ రాశి వారు చూడొద్దట‌

By:  Tupaki Desk   |   27 July 2018 9:06 AM GMT
ఈ రోజు చంద్ర‌గ్ర‌హ‌ణాన్ని ఆ రాశి వారు చూడొద్దట‌
X
ఈ శ‌తాబ్దిలోనే అత్యంత సుదీర్ఘంగా సాగే సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం ఈ రోజు (శుక్ర‌వారం) రాత్రి 11.50 గంట‌ల‌కు ఏర్ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. రోజు మార‌టానికి ప‌ది నిమిషాల ముందు మొద‌ల‌య్యే చంద్ర‌గ్ర‌హ‌ణం శ‌నివారం తెల్ల‌వారు జాము వ‌ర‌కూ సాగ‌నుంది.

గ్ర‌హ‌ణం మొద‌లు 11.50 అయినా.. మ‌ధ్య‌కాలం రాత్రి 1.52 గంట‌ల‌క‌ని.. గ్ర‌హ‌ణం విడిచే స‌మ‌యం 2.43 గంట‌ల‌ని.. తెల్ల‌వారుజామున 3.49 గంట‌ల‌కు గ్ర‌హ‌ణం పూర్తిగా వీడుతుంద‌ని చెబుతున్నారు. ఈ గ్ర‌హ‌ణం కార‌ణంగా నీళ్లు విషంగా మార‌తాయ‌ని.. వ‌స్తువులు చెడిపోతాయ‌న్నది స‌రికాకున్నా.. కొన్ని న‌మ్మ‌కాలు మాత్రం చాలామంది న‌మ్ముతారు.

గ్ర‌హ‌ణ స‌మ‌యంలో పెద్ద బేసిన్లో నీళ్లు పోసి.. రోక‌లి నిల‌బెడితే.. అలానే నిలిచి ఉండ‌టం.. గ్ర‌హ‌ణం పూర్తి కాగానే ప‌డిపోవ‌టం ఎలా సాధ్య‌మ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌రు.

అయితే.. శాస్త్రీయంగా ఈ గ్ర‌హణాన్ని ఎవ‌రైనా చూడొద్ద‌ని చెబుతున్నా.. జ్యోతిష్య పండితుల లెక్క‌లు మాత్రం మ‌రోలా ఉన్నాయి. కేతుగ్ర‌స్త చంద్ర‌గ్ర‌హ‌ణం ఉత్త‌రాషాఢ శ్ర‌వ‌ణ న‌క్ష‌త్రంలో మ‌క‌ర రాశిలో సంభ‌విస్తోంద‌ని.. అందువ‌ల్ల మ‌క‌ర‌రాశి వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చూడొద్ద‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో మేషం.. వృశ్చికం.. సింహం రాశుల వారికి ఈ గ్ర‌హ‌ణం కార‌ణంగా ప‌రిస్ఙితులు అనుకూలంగా ఉంటాయ‌ని.. అదే స‌మ‌యంలో వృష‌భం.. క‌ర్కాట‌కం.. క‌న్య‌.. ధ‌న‌స్సు రాశుల వారికి మ‌ధ్య ఫ‌లితాలు ఇస్తాయ‌ని అంటున్నారు.

ఇక‌.. మిథునం.. కుంభం.. తుల‌.. మ‌క‌ర రాశుల వారికి మాత్రం అథ‌మ ఫ‌లితాలు ఉంటాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. న‌మ్మే వారు న‌మ్మ‌టం.. న‌మ్మ‌ని వారు న‌మ్మ‌క త‌మ ప‌ని తాము చేసుకోవ‌టం మంచిది. ఇక‌.. అర్థ‌రాత్రి వేళ‌లో చోటు చేసుకుంటున్న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం కావ‌టంతో.. కొంద‌రు మిన‌హా చాలామంది గ్ర‌హ‌ణం మొత్తాన్ని చూసే అవ‌కాశం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.