Begin typing your search above and press return to search.
కరోనా అలర్ట్ : ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారికి షాకింగ్ న్యూస్
By: Tupaki Desk | 19 March 2020 3:01 AM GMTచైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాకింది. దాదాపుగా 160దేశాలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డాయి. రెండు లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజు రోజుకు ఈ సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. 8 వేల మంది మృతి చెందగా ఈ సంఖ్య ఇంకా ఎంతకు పెరుగుతుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో వుహాన్ యూనివర్శిటీ జోంగ్‌నాన్ హాస్పిటల్ లోని కరోనా బాధితులపై జింగ్ హువాన్ సంస్థ ఒక సర్వే నిర్వహించగా అందులో ఆశ్చర్యకర విషయం వెళ్లడయ్యింది.
ఎవరికి అయితే ‘ఏ’ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు కరోనాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని ఆ సర్వేలో నిర్థారించారు. ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకిందంటే మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయంటూ వారు అన్నారు. వుహాన్ లో కరోనా వైరస్ వల్ల మరణించిన 206 మందిలో ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏకంగా 85 మంది ఉన్నట్లుగా వారు నిర్థారించారు. ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనాను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుందని ఈ ప్రయోగంలో వెళ్లడయ్యిందని వారు పేర్కొన్నారు.
ఇక ఓ బ్లడ్ గ్రూప్ వారికి కూడా కరోనా కాస్త ఇబ్బందికరంగానే ఉందని అన్నారు. ఓ బ్లడ్ గ్రూప్ వారికి కూడా కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోదక శక్తి సరిపోవడం లేదంటూ వైధ్యులు అంటున్నారు. అందుకే ఏ ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ వారు ఖచ్చితంగా కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇతరుల కంటే ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఒక వేళ ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్థారణ అయితే ఇతర బాధితుల కంటే ఎక్కువ శ్రద్దతో వారిని చూసుకోవాలంటూ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాగ్రత్త ఏ బ్లడ్ గ్రూప్ వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇతరులు కూడా లైట్ గా ఏమీ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ పరిశుభ్రతను పాటించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.