Begin typing your search above and press return to search.
ఈ వీకెండ్ అమెరికాలో రక్తసిక్తం.. తుపాకీ తూటాలకు 220 మంది మృతి
By: Tupaki Desk | 7 July 2022 6:30 AM GMTఅమెరికాలో తుపాకీ హింస ఆగడం లేదు. ఎంతకూ తగ్గడం లేదు. ఈ వారాంతం అమెరికా నెత్తురోడింది. వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారికి పీడకలను మిగిల్చింది. తుపాకీ నియంత్రణ చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా అమెరికాలో హింస ఆగడం లేదు. తుపాకీ హింస జూలై నాలుగో వారాంతంలో మరింత పెరిగింది. దాదాపు ప్రతి అమెరికా రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కనీసం 220 మంది మరణించారు. 570 మంది గాయపడ్డారు.
జూలై 1-4 మధ్య దేశవ్యాప్తంగా 500కి పైగా కాల్పుల ఘటనలు నమోదు కాగా వారాంతపు కాల్పుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. గాయాల సంఖ్యకు దాదాపు సమానంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
వీకెండ్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాల్పులు జరగనివి కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సెలవు రావడం.. వారాంతంలో ప్రజలంతా ఎంజాయ్ కోసం బయటకు వచ్చారు. అన్ని తుపాకీ హింస సంఘటనలలో కనీసం 11 తుపాకీ హింసాత్మక సామూహిక కాల్పులు జరిగినట్లు తేలింది.
కాల్పులు జరిపిన వ్యక్తిని మినహాయించి.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మరణించినా.. తుపాకీ కాల్పుల్లో గాయపడితే.. సామూహిక కాల్పులుగా పరిగణించబడుతుంది.
డేటాబేస్ ప్రకారం.. ఈ సంవత్సరం ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా 315 సామూహిక కాల్పులు చోటుచేసుకున్నాయి. తుపాకీ హింస కారణంగా సంభవించిన మరణాలు చూస్తే దాదాపు 22,500 ఉన్నాయి. తుపాకీ హింసలో ఇప్పటివరకు గుర్తించిన గాయాల సంఖ్య మొత్తం మరణాల సంఖ్యకు చేరుకుంటుంది.
2021లో ఆదే సెలవు వారాంతంలో జరిగిన కాల్పుల్లో 180 మందికి పైగా మరణించారు. 516 మంది గాయపడ్డారు. దీన్ని అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదని.. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని అర్థమవుతోంది.