Begin typing your search above and press return to search.

ట్రంప్ కు పోటీగా బ్లూమ్ బర్గ్

By:  Tupaki Desk   |   26 Nov 2019 2:30 PM GMT
ట్రంప్ కు పోటీగా బ్లూమ్ బర్గ్
X
ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడు కావాలనే తపన అందరిలోనూ ఉంటుంది. ఇన్నాళ్లు ప్రజా ఉద్యమాలు, అభ్యుదయ వాదులు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేవారు. కానీ పోయిన సారి అపర కుబేరుడు ట్రంప్ తన డబ్బు, పరపతితో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.. దీంతో ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవిపై పారిశ్రామికవేత్తల కన్నుపడింది.

తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో తాను నిలుస్తున్నట్టు ప్రముఖ అమెరికన్ పారిశ్రామికవేత్త మైఖేల్ బ్లూమ్ బర్గ్ ప్రకటించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ట్రంప్ లాంటి అపర కుబేరుడిని ఓడించడానికి తనలాంటి భారీ పారిశ్రామికవేత్త అయితేనే బెటర్ అని ఆయన డెమోక్రాట్లను ఒప్పిస్తున్నారు.

ట్రంప్ అత్యంత ప్రమాదకారి అని.. మరోసారి గెలిస్తే నష్టాన్ని పూడ్చలేమని.. అతడికి గట్టి పోటీనివ్వాలంటే తానే సరైన వ్యక్తి అని బ్లూమ్ బర్గ్ ప్రకటించారు.

బ్లూమ్ బర్గ్ అమెరికాలో ప్రముఖ వ్యాపార దిగ్గజం. గతంలో న్యూయార్క్ మేయర్ గా పనిచేశారు. స్వచ్ఛంద సేవల కోసం 10 బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. 129 దేశాల్లో 510 నగరాల్లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. ప్రధాని మోడీకి సన్నిహితుడైన బ్లూమ్ బర్గ్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతుండడంతో ట్రంప్ కు గట్టి పోటీ ఖాయమని అమెరికన్ పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.