Begin typing your search above and press return to search.
ఒక రోజు.. రెండు షాకులు.. కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ
By: Tupaki Desk | 25 Aug 2022 8:30 AM GMTటైం బాగోలేదన్న మాటను అందరూ వింటుంటారు. కానీ.. ఆ మాటకు నిలువెత్తు రూపంగా మారింది కాంగ్రెస్ పార్టీ. ఓవైపు అంత పెద్ద పార్టీ అధ్యక్ష స్థానాన్ని స్వీకరించేందుకు సైతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
గాంధీ కుటుంబానికి జేబు సంస్థగా మారిందన్న విమర్శల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ ఆ పదవిని చేపట్టేందుకు నో అంటే నో అనేయగా.. ప్రియాంక గాంధీ సైతం ఆ పదవిని స్వీకరించేందుకుసిద్ధంగా లేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. పార్టీ అధినేత్రిగా వ్యవహరిస్తున్న సోనియా ఆరోగ్యం సరిగా లేకపోవటం.. మరోసారి విదేశాల్లో ఆయనకు చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
మరోవైపు.. పార్టీకి సంబంధించిన వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా రోజు వ్యవధిలో రెండు షాకులు ఎదురయ్యాయి. అందులో ఒకటి.. పార్టీకి చెందిన యూట్యూబ్ చానల్ 'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్'ను ఆన్ లైన్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్టు అయ్యింది.
యూట్యూబ్ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. అనుకోకుండా జరిగిందా? లేదంటే కావాలనే చేశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చానల్ తొలగింపుపై చర్చలు జరుపుతున్నామని.. సమస్యను వెంటనే పరిష్కరించి చానల్ ను పునరుద్దరించే పనుల్లో ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెల్లడించింది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తన పదవికి రాజీనామా చేస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మీద ఘాటు విమర్శలు చేశారు. యువత ఆకాంక్షలు నెరవేరేలా పార్టీ నిర్ణయాల్లో స్పష్టత ఉండటం లేదని.. గాంధీ త్రయాలను (సోనియా.. రాహుల్.. ప్రియాంక) కలిసేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నా వారు అనుమతి ఇవ్వటం లేదన్నారు. తమను కలిసేందుకు వారుసిద్ధంగా లేరన్న ఆయన.. తాను గడిచిన ఎనిమిదేళ్లుగా పార్టీ నుంచి ఏం ఆశించలేదన్నారు.
కాంగ్రెస్ కోసం పని చేసిన తాను.. పార్టీ అధిష్ఠానానికి దగ్గరగా ఉన్న వారికి తలవంచాల్సి వస్తోందన్నారు. తనకు అదేమీ ఆమోదయోగ్యమైనది కాదన్నారు. తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపిన జైవీర్ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా అభివర్ణిస్తున్నారు.