Begin typing your search above and press return to search.

రఘురామ ఒంటిపై దెబ్బలు.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

By:  Tupaki Desk   |   16 May 2021 5:08 AM GMT
రఘురామ ఒంటిపై దెబ్బలు.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
X
ప్రభుత్వంపై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే విచారణలో తనను పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామ జడ్జీకి ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. పోలీసులు నన్న రాత్రి కాళ్లు వాచిపోయేలా కొట్టారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసి విచారిస్తోంది.

ఈ నేపథ్యంలో రఘురామను పోలీసులు నిజంగా కొట్టారా? లేక వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నట్టు ఇదంతా కట్టుకథనా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రఘురామ అనుకూల వర్గం పోలీసుల తీరును ఖండిస్తూ పోస్టులు పెడుతోంది. వైసీపీ వర్గాలు, అడ్వకేట్ జనరల్ మాత్రం ఇదంతా వట్టి డ్రామా అంటున్నారు.

రఘురామకృష్ణంరాజుకు షుగర్ వ్యాధి ఉందని.. అందువల్లే ఆయన కాళ్లు అలా కందిపోయినట్టు ఉన్నాయని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఫెరిపెరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్నవారికి, సోరియాసిస్ ఉన్నవారికి కాళ్లు ఇలా అవుతాయని చెబుతున్నారు. రఘురామను పోలీసులు కొట్టారన్నది పచ్చి అబద్దం అంటున్నారు.

ఈ గాయాలపై రెండు రోజుల్లో మెడికల్ బోర్డు పరీక్షలు చేసి నివేదికను హైకోర్టుకు అందచేస్తోంది. అందులోని రిపోర్టును బట్టి అవి పోలీసులు కొట్టారా? లేక ఏదైనా వ్యాధితో వచ్చాయా? అన్నది తేలుతుంది. ఆ తర్వాత హైకోర్టు దీనిపై నిర్ణయిస్తుంది.