Begin typing your search above and press return to search.
'బ్లూ ఆరిజన్' మిషన్ సక్సెస్ !
By: Tupaki Desk | 16 Jan 2021 1:49 PM GMTజెఫ్ బెజోస్ స్థాపించిన రాకెట్ సంస్థ బ్లూ ఆరిజిన్ పరీక్ష సక్సెస్ అయింది. తాజా న్యూ షెపర్డ్ మిషన్ తో మానవులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి మరో అడుగు ముందుకు వేసింది. సంస్థ మొట్టమొదటి స్పేస్ ఫ్లైట్ 14 వ టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా పరీక్షించారు. లాంచింగ్ నుంచి క్యాప్సూల్ యొక్క మృధువైన ల్యాండింగ్ వరకు మొత్తం 10 నిమిషాల సమయంలో సక్సెస్ ఫుల్ గా చేరింది. దీనికి ఎస్‌ఎస్-14 అని పేరు పెట్టారు.
ఈ విజయవంతమైన విమానం కొత్త బూస్టర్లను, కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యాప్సూళ్లను పరీక్షించింది. అమెజాన్ యొక్క ప్రైవేట్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్. ఏప్రిల్ నుంచి తన మొదటి ప్రయాణికుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకున్నది. బ్లా ఆరిజన్ యొక్క న్యూ షెపర్డ్ అంతరిక్షంలోకి మొట్టమొదటి మార్గదర్శక విమానంలో ప్రయాణించి విజయవంతమైన ల్యాండింగ్ చేపట్టి ఐదు సంవత్సరాలు దాటింది. బ్లూ ఆరిజిన్ తన మొట్టమొదటి మానవ ప్రయాణికుడిని అంతరిక్షంలోకి పంపే పనిని ఆశించిన దానికంటే నెమ్మదిగా సాగుతుంది. వ్యోమగాములను మిషన్ కంట్రోల్‌తో మాట్లాడటానికి ఇది పుష్-టు-టాక్ సిస్టంను కలిగి ఉన్నది. క్యాప్సూల్ లో శబ్దాన్ని తగ్గించడానికి కుషన్ లైనింగ్స్, ఎయిర్ కండిషన్, తేమ నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి.
న్యూ షెపర్డ్ పూర్తిగా స్వయంప్రతిపత్తి వ్యవస్థ. ఈ పరీక్షలో పేలోడ్‌ను లోపల ఉంచడం ద్వారా రాకెట్ ఎగిరింది. క్యాప్సూల్ భూమికి తిరిగి వచ్చే ముందు సున్నా గురుత్వాకర్షణ వద్ద 10 నిమిషాలు గడిపింది. ఆరుగురు వ్యోమగాములను రాకెట్ ఎగువ భాగంలో తీసుకువెళ్ళడానికి వీలుగా క్యాప్సూల్ ను రూపొందించారు.