Begin typing your search above and press return to search.
ఆ గేమ్ ఇంకో ప్రాణం తీసుకుంది
By: Tupaki Desk | 31 Aug 2017 8:16 AM GMTబ్లూ వేల్ చాలెంజ్.. ఇప్పుడు రోజుకోచోట పంజా విసురుతున్న ప్రాణాంతక క్రీడ. ఈ గేమ్ ఉచ్చులోపడిన 14 ఏళ్ల విద్యార్థి ముంబైలో అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోవడం భారత్ లో బ్లూవేల్ కు సంబంధించి వెలుగు చూసిన తొలి ఘటన. అనంతరం డెహ్రాడూన్ - పశ్చిమ మిడ్నాపూర్ - పుణెలో మూడు ఘటనలు వెలుగుచూసినా - బ్లూవేల్ కారణంగానే అవి జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు మాత్రం దొరుకలేదు. కానీ, ఈ ఘటనలన్నింటిలోనూ చనిపోయిన పిల్లలు ఏదో ఒక సందర్భంలో బ్లూవేల్ గేమ్ గురించి సన్నిహితుల వద్ద ప్రస్తావించడం గమనార్హం. ఇక షోలాపూర్ - ఇండోర్ లలో ఇద్దరు విద్యార్థులు బ్లూవేల్ టాస్క్ లతో ఆత్మహత్యకు ప్రయత్నించగా - సహచరులు - పోలీసులు అడ్డుకోగలిగారు. కానీ మరో ఘటన ఇదే రీతిలో తాజాగా చోటుచేసుకుంది.
తమిళనాడులోని మధురైకి చెందిన విఘ్నేశ్ బ్లూవేల్ గేమ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం 4.15 నిమిషాలను అతను ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. విఘ్నేశ్ ఎడమ చేతిపై బ్లూవేల్ బొమ్మ ఉంది. దాని కింద బ్లూవేల్ అని అక్షరాలతో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విఘ్నేశ్ రాసిన సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లూవేల్ అతి ప్రమాదకరమైన ఆట అని సూసైడ్ నోట్ లో విఘ్నేశ్ రాసినట్లు పోలీసులు చెప్పారు. ``ఇది గేమ్ కాదు - ఇదో డేంజర్. ఇది ఆడితే - దీని నుంచి బయటపడలేం`` అని అతను నోట్ లో రాసినట్లు గుర్తించారు. విఘ్నేశ్ బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే తమిళనాడులో బ్లూవేల్ ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిది. పోలీసులు ఈ ఆత్మహత్యపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడుతున్న పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలని ఇటీవలే తమిళనాడు పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు.
కాగా, కొద్దికాలం క్రితం ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తున్న బ్లూవేల్ చాలెంజ్ లింకుల్ని తొలగించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయ - ఐటీశాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆన్ లైన్ సాంకేతిక వేదికలన్నింటికీ ఈమేరకు ఆదేశాలను జారీ చేశామని, వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ ప్రమాదకర ఆటపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతున్నాయని, టీనేజర్ల ప్రాణాలతో ఎవరు చెలగాటమాడినా సహించబోమని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
బ్లూవేల్ ప్రాణాంతక క్రీడను రూపొందించింది రష్యాకు చెందిన 22 ఏళ్ల ఫిలిప్ బుడేకిన్. భయం ఆధారంగా గేమ్ ను తయారు చేయాలనుకున్నానని, దీంట్లో భాగంగానే బ్లూవేల్ చాలెంజ్ ను సృష్టించానంటాడీ సైకో డెవలపర్. రష్యాలో 130మందికి పైగా టీనేజర్లు ఈ గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో బుడేకిన్ ను గత మేనెలలో పోలీసులు అరెస్టు చేశారు. బుడేకిన్ నేరుగా కొంతమంది చిన్నారులకు క్యురేటర్ గా టాస్క్ లు ఇచ్చాడని దర్యాప్తులో తేలింది. విచారణ సందర్భంగా ఆయన మానసిక స్థితి సరిగాలేదని తేలింది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇలాంటి గేమ్ తయారు చేసినందుకు నేను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. రష్యాలో 117మంది టీనేజర్లు ఆత్మహత్య చేసుకోవడానికి నేను బాధ్యుడిని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుడేకిన్ బాధపడ్డాడు. విచారణ అనంతరం రష్యా కోర్టు ఆయనకు మూడేళ్ల కారాగారశిక్ష విధించింది.