Begin typing your search above and press return to search.
ముంబయిలో కుక్కల ఓనర్లకు ఫైన్ షాక్!
By: Tupaki Desk | 5 Jun 2018 11:30 PM GMTపరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ తీవ్రంగా కృషి చేస్తుంటుంది. అయితే.. ఈ విభాగం ఎంత పని చేసినా.. ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. దీనికి కారణం లేకపోలేదు. మున్సిపల్.. కార్పొరేషన్ శాఖలకు సంబంధించి చేయాల్సిన పనులు భారీగా ఉండటం.. సిబ్బంది అరకొరగా ఉండటంతో పాటు.. అవినీతి.. ఆక్రమాల కారణంగా వారి సేవలకు తగిన గుర్తింపు లభించని పరిస్థితి. తాజాగా పరిసరాల్ని పాడు చేసే పెంపుడు కుక్కలపై ముంబయి కార్పొరేషన్ అధికారులు సరికొత్తగా వ్యవహరిస్తున్నారు.
ముంబయి మహానగరంలో సంపన్నులు నివాసం ఉండే మలబార్ హిల్స్.. పెద్దార్ రోడ్డు.. నేపాన్ సీ రోడ్.. ఆగస్ట్ క్రాంతి మార్గ్ ప్రాంతాల్లో ముంబయి మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు వీధుల్లో మలమూత్ర విసర్జన చేయించే యజమానులపై ఫైర్ కొరడా ఝుళిపించారు.
వీధుల్ని పాడు చేసేలా కుక్కల మలమూత్ర విసర్జనకు కారణమైన కుక్కల యజమానులపై ఫైన్లు వేశారు. పెంపుడు కుక్కల కారణంగా పాడైన రోడ్లను క్లీన్ చేశారు. ఇందుకుగాను పెంపుడు కుక్కల యజమానులు ఒక్కొక్కరిపైనా రూ.500 చొప్పున ఫైన్ వేశారు. రానున్న రోజుల్లోనూ ఈ రీతిలో మలమూత్రాలు చేయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ సహాయ కమిషనర్ వార్నింగ్ ఇస్తున్నారు. ముంబయి కార్పొరేషన్ ను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్ఫూర్తి తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.