Begin typing your search above and press return to search.
అర్జెంట్ అయ్యి కారు దిగి పోసుకుంటుంటే ...BMW కారుని ఎత్తుకెళ్లిన దొంగలు?
By: Tupaki Desk | 16 March 2020 5:49 AM GMTఈ ప్రపంచం లో ఈ క్షణం ఉన్నది ..నెక్స్ట్ సెకండ్ కి ఉంటుందో లేదో ఎవ్వరం చెప్పలేము. ఏ నిమిషానికి ఏం జరుగునో అని ఊరికే చెప్పలేదు కదా. ఈ జీవితంలో వచ్చే సెకండ్ ఏంజరుగుతుందో ఎవ్వరం ఊహించలేము. అయితే , తాజాగా ఒక వ్యక్తికి చెందిన BMW కారుని దొంగలు పట్టుకుపోయారు. దొంగలు అన్నాక కార్లు , బైక్స్ ఎత్తుకుపోక ఏంచేస్తారు ? అని అనుకుంటున్నారా? దొంగలు చేసే పనే అదే అనుకోండి. కానీ , ఈ దొంగలు మాత్రం దొంగల దగ్గరే దొంగతనం చేయగల ట్యాలెంట్ ఉన్నోళ్లు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కారు లో వెళ్తూ ..మధ్యలో పకృతి పిలవడం తో ...కారుని అపి పోసుకొని వచ్చే సమయానికే కారు కనిపించలేదు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో శనివారం (మార్చి 14 ) రాత్రి ఫేస్ 2 పోలీస్ స్టేషన్ పరిధి లో సెక్టార్ 90 ప్రాంతం లో జరిగింది. కారుని పోగొట్టుకున్న బాదుతుడి పేరు రిషబ్ అరోరా. స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రిషబ్ ఓ పార్టీకి అటెండ్ అయ్యాడు. ఇక పార్టీలో పీకలదాకా మందు తాగి, పార్టీ అయిపోయాక రిషబ్ తన BMW కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంతలో దారి లో అతడికి యూరిన్ అర్జంట్ అయ్యింది. ఇక ఓపిక పట్టుకోలేక వెంటనే రోడ్డు పక్కన కారు ఆపాడు. అలా ఆ పని కానిస్తున్న సమయం లో , అతని కారుని ఫాలో అవుతూ వచ్చిన దుండగులు కారు తో పరారైయ్యారు.
యూరిన్ పోసుకొని వచ్చేసరికి , అక్కడ తన కారు కనిపించకపోవడం తో దెబ్బకి మనోడికి మత్తు వదిలిపోయింది. దీని తో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కారు చోరీ అయ్యిందని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. కొందరు దుండగులు బైక్ పై వచ్చారని, తనకు గన్ గురి పెట్టి బెదిరించారని, ఆ తర్వాత కారులో పారిపోయారని చెప్పాడు. ఆ లగ్జరీ కారు తన బావదని, దానిపై రూ.40లక్షల లోన్ పెండింగ్ ఉందని రిషబ్ తెలిపాడు. అలాగే ఆ కారు ఖరీదు సుమారుగా కోటి వరకు ఉండచ్చు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పక్కా పథకం ప్రకారమే చోరీ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఆ సమయం లో రిషబ్ ఫుల్ గా తాగి ఉండటం తో వారి ఇంకా సులభం అయ్యింది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.