Begin typing your search above and press return to search.

ఎన్నికల అఫిడఫిట్లో తప్పుడు వివరాలు .. చిక్కుల్లో పడ్డ మహా సీఎం 'థాక్రే' !

By:  Tupaki Desk   |   21 Sep 2020 5:32 PM GMT
ఎన్నికల అఫిడఫిట్లో తప్పుడు వివరాలు .. చిక్కుల్లో పడ్డ మహా సీఎం థాక్రే !
X
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తప్పుడు ఎన్నికల అఫిడవిట్లు దాఖలు చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలన్న తమ అభ్యర్థన గురించి ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. నెల రోజుల క్రితమే ఈసీ దీనిపై ఈ బోర్డుకు ఓ లేఖ రాసి కూడా పంపింది.

ఈ ముగ్గురు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పుల విషయాన్ని సరిచూడాలని చేయాలని కూడా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని 125 ఏ సెక్షన్ ప్రకారం... ఈ అఫిడవిట్లలో ఏదైనా అవాస్తవం ఉందని తేలితే, సదరు అభ్యర్థికి ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. అబధ్ధాల అఫిడవిట్లపై తీవ్ర చర్య తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీచేసింది. ఇదే సమయంలో పన్నుల బోర్డుతో కూడా టచ్ లో ఉంటోంది. మరి, ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే, ఆయన కొడుకు ఆదిత్య, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే వాస్తవ అఫిడవిట్లే సమర్పించారా లేక అవాస్తవాల తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారా అన్న విషయం ప్రత్యక్ష పన్నుల బోర్డు విచారణలో వెల్లడికానుంది.