Begin typing your search above and press return to search.

అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి పోతుందా?

By:  Tupaki Desk   |   19 Sep 2019 7:23 AM GMT
అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి పోతుందా?
X
బోటు ప్రమాదం విషయంలో పోలీసుల, అధికారుల అవినీతి బయటపడుతూ ఉంది. అనుమతి - ఫిట్ నెస్ లోని బోట్లు.. డ్రైవింగ్ కూడా సరిగా రాని వ్యక్తులు… టూరిజం శాఖలోని అవినీతిని అడ్డం పెట్టుకుని దందా సాగిస్తున్నారనే విషయం తేటతెల్లం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి కి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం కొత్తగా ఏర్పడినది అయినా.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టూరిస్టు ప్రాంతాల్లోని పోలీసులు - అధికారులు లంచాలకు మరిగి..ఇలా అనుమతి ఇవ్వకూడని బోట్లకు అనుమతిని ఇస్తున్నారనే అభిప్రాయాలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. తాము ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదని - అయితే మంత్రులకు తెలియకుండానే ఇలాంటి బోట్లు కదులుతున్నాయా? అంటూ బాధితులు ప్రశ్నిస్తూ ఉన్నారు.

తమ వారిని కోల్పోయిన ఆవేదనలో వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత కలిగిన మంత్రులపై చర్యలు తీసుకోవడం జరిగింది.

చంద్రబాబు హయాంలో అలాంటి రాజీనామాలు - తప్పించడాలు లేవు. అయితే వైఎస్ హయాంలో అలాంటి నియమాలను స్ట్రిక్ట్ గా అమలు చేశారు. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా కోరతారా? లేక పర్యాటక శాఖ బాధ్యతలు ఆయన నుంచి తప్పిస్తారా? అనే అంశంపై చర్చ మొదలైంది.