Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర తీరానికి తుపాకులతో బోటు.. హైఅలెర్ట్.. ఎక్కడిది? దాని కథేంటి?

By:  Tupaki Desk   |   19 Aug 2022 4:47 AM GMT
మహారాష్ట్ర తీరానికి తుపాకులతో బోటు.. హైఅలెర్ట్.. ఎక్కడిది? దాని కథేంటి?
X
పాకిస్తాన్ కరాచీ నుంచి భారీ ఆయుధాలతో ఒక బోటులో ముంబై తీరానికి వచ్చి 26/11 ఉగ్రదాడులు చేసి దేశాన్ని అతలాకుతలం చేశారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల కుట్రలకు నాడు ఎంతో మంది చనిపోయారు.అదింకా మాయని మచ్చలా మహారాష్ట్రపై అలాగే ఉంది. ఈ దాడిలో 160 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి అలాంటి పడవే మహారాష్ట్ర సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది. అందులో భారీగా ఏకే 47 ఆయుధాలతోపాటు మరికొన్ని బుల్లెట్లు కనిపించాయి. దీంతో కేంద్రం హైఅలెర్ట్ ప్రకటించింది.

మహారాష్ట్రలో భారీ ఉగ్రకుట్ర వెలుగుచూసింది. రాయ్ గఢ్ లోని హరిహరేశ్వర్ బీచ్ దగ్గర అనుమానాస్పద స్థితిలో రెండు బోట్లు తీవ్ర కలకలం రేపాయి. సముద్ర జలాలపై తేలియాడుతున్న బోట్ల సమాచారాన్ని అందుకున్న పోలీసులు సముద్రంలోకి వెళ్లి పరిశీలించగా ఏకే 47 ఆయుధాలతోపాటు బుల్లెట్లు కనిపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైఅలెర్ట్ ప్రకటించారు.

కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ దీన్ని నిషితంగా పరిశీలిస్తోంది. ముంబైకి కేవలం 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరివర్ధన ప్రాంతంలో ఈ బోటు కనిపించింది. బోటులో సిబ్బంది ఎవరూ లేరని తెలుసుకున్నారు.

ఆస్ట్రేలియా పడవగా గుర్తింపు లేడీ హాన్ అనే ఈ పడవ ఆస్ట్రేలియా పౌరురాలు హానా లార్డోర్గాన్ అనే మహిళకు చెందినదిగా పోలీసులు తేల్చారు. దీనికి ఎలా సెక్యూరిటీ థ్రెట్ లేదని తేల్చారు. ఒమన్ కోస్టు సమీపంలో ఈ ఏడాది జూన్ నెలలో ఈ బోటులోని సిబ్బందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాల విక్రయదారును సంప్రదించగా.. మిస్సైనట్లు చెప్పిన ఆయుధాలు పడవలో ఉన్నట్లు తేలింది. అదే సమయంలో మరో బోటు కూడా భరన్ ఖోల్ కినారా వద్ద లభించింది.దీనిలో పలు డాక్యుమెంట్లు లభించాయి. రెండో బోటులో కూడా ఎవరూ లేరు.

మస్కట్ నుంచి ఈ బోటు యూరప్ వెళుతోంది. జూన్ 26న ఉదయం 10 గంటలకు ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఒంటిగంట ప్రాంతంలో సెయిలర్లు సాయం కోసం సంప్రదించారు. ఓ కొరియన్ వార్ షిప్ పడవలోని సిబ్బందిని కాపాడింది. బోటును ఒమన్ కు అప్పగించింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈ బోటును లాగలేకపోయారు. ప్రస్తుతం ఈ బోటు హరిహరేశ్వర్ తీరంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ బోటు వ్యవహారంపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.