Begin typing your search above and press return to search.
బోధన్... అవిశ్వాసం తప్పెన్...
By: Tupaki Desk | 14 July 2018 4:39 PM GMTబోధన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం డ్రామా పలు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఓ మున్సీపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే చికాకులు పెడుతోంది. అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేందుకు ఏకంగా ఎంపి - ఎంఎల్ ఎలు పార్టీలో ముఖ్యనేతలంతా వ్యూహాలు రచించాల్సి వస్తోంది. అధికార పార్టీకి చెందిన చైర్మన్ కావడంతో అవిశ్వాసం రాకుండా ఉండేందుకు నిజామబాద్ ఎంపి - ముఖ్యమంత్రి కుమార్తె రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంపి కవిత వ్యూహ రచన చేసి ప్రస్తుతానికి అవిశ్వాస తీర్మానం నుంచి అధికార పార్టీ బయటపడేశారు. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్లు అందరు ఈ నెల నాలుగవ తేదిన కలెక్టరును కలిసారు. అవిశ్వాస తీర్మనం పై నోటీసు ఇచ్చారు.
ఈ నెల 25 న జరిగే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఇదే విషయాన్ని కౌన్సిల్ సభ్యులకు తెలిపారు. దీంతో రాజకీయ వేడి ఊపందుకుంది. అవిశ్వాస తీర్మనం వస్తే పార్టీకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని నిజామబాద్ ఎంపి కవిత రంగంలోకి దిగారు. వెంటనే మొత్తం పరిణామాలను తమ వైపు తిప్పుకున్నారు అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడేందుకు ఓటింగ్ కు దూరంగా ఉండడమే పరిష్కారమని తేల్చారు. అంతే చకచక పావులు కదిపారు ఎంపి కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్యే షకీల్ తో సంప్రదింపులు జరిపారు. పార్టీ కౌన్సిలర్లను సమావేశపరచి అవిశ్వాసానికి దూరంగా ఉండాలని సూచించారు.
మరోవైపు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా తన కౌన్సిలర్లతో ఎంపి కవితను కలిసారు. ఆ పార్టీకి ఎనిమిదిమంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా అవిశ్వాస తీర్మానం సమయంలో దూరంగా ఉంటామని ఎంపి కవితకు హామీ ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం సమస్య నుంచి అధికార పార్టీ బయటపడినట్లే.