Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై మరో దళిత నేత యుద్ధం
By: Tupaki Desk | 1 Nov 2018 5:30 PM GMTతెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో భాగంగా వెలువరించిన జాబితాపై టీఆర్ ఎస్ లో అసమ్మతి సెగ రగులుతోంది. సీటు ఆశించిన ఆశావహులు జాబితాలో పేరు రాకపోవడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటించకపోవడంతో తాజా మాజీ ఎమ్మెల్యేలైన కొండా సురేఖ దంపతులు, బాబుమోహన్ తోపాటు పలువురు నేతలు టీఆర్ ఎస్ - కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు నేతలు ఆ జాబితాలోనే ఉన్నారనుకున్న క్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే - టికెట్ కోసం నిరీక్షణలో ఉన్న బొడిగ శోభ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు టికెట్ రానప్పటికీ ప్రచారం మొదలుపెట్టిన బొడిగ శోభ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 సంవత్సరాలు టీఆర్ఎస్‌లో పని చేశానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పుడు తాను కారం పొడి పట్టుకుని నిలబడ్డానని తెలిపారు. తనతో లబ్ధి పొందిన నాయకులే తనను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయడం అనేది పరిగణనలోకి తీసుకుంటే, పనితీరు ఆధారంగా సీటు ఇవ్వాలనకుంటే.. చొప్పదండి సీటు తనకే ఇవ్వాలన్నారు. చొప్పదండి నుంచి దళిత బిడ్డకు అవకాశం ఇవ్వాలని.. అది కూడా తనకు (బొడిగ శోభ)కు ఇవ్వాలని సీఎంను కోరారు. 60 రోజులు ఓపిక పట్టానని తెలిపారు. తన మీద ఫిర్యాదు చేసిన వారికి టికెట్ ఇస్తే సహించే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. టికెట్ ఇవ్వకపోతే చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు.
ఒక మాదిగ బిడ్డను అభ్యర్థిగా ప్రకటించడంలో ఇంత జాప్యమా అని బొడిగ శోభ వాపోయారు. ఓట్ల దగ్గర దళిత మహిళల అవసరం ఉంటుంది... కానీ ఒక దళిత మహిళ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తారా? ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని ప్రశ్నించారు. టికెట్ కేటాయింపు విషయంలో ఇప్పటికే ఎంపీ కవిత - కేశవరావు - మంత్రి హరీష్ రావు - మంత్రి ఈటెల రాజేందర్ ను కలిశానని తెలిపిన శోభ ముఖ్యమంత్రి పిలుపు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో ఒక్క దళిత మహిళ కూడా లేరని పేర్కొన్నారు. తాజాగా గులాబీ పార్టీలో మరో అసమ్మతి స్వరం వినిపిస్తుండటం..ఏకంగా స్వతంత్ర్య అభ్యర్థిగా అయినా బరిలో దిగుతానని ప్రకటించిన నేపథ్యంలో పార్టీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.