Begin typing your search above and press return to search.

ఏపీలో బోగస్ చలాన్ల కుంభకోణం... ప్రభుత్వం సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   3 Sep 2021 8:30 AM GMT
ఏపీలో బోగస్ చలాన్ల కుంభకోణం... ప్రభుత్వం సంచలన నిర్ణయం
X
బోగస్ చలాన్ల కుంభకోణం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తరహాలోనే మరి కొన్ని శాఖల్లోనూ అంతర్గత తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చలానాల రూపంలో ప్రజలు చెల్లించే నగదు సీఎఫ్ ఎం ఎస్ కు చేరుతుందా , లేదా అనే అంశంపై వివరాలు సేకరిస్తోన్నారు అధికారులు. ఎక్సైజ్, మైనింగ్, రవాణ, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత తనిఖీలు చేపడుతున్నారు.

ప్రజలు చెల్లించే చలానాల నగదు సీఎఫ్ ఎం ఎస్ కు చేరేందుకు జాప్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. జాప్యం కావడం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని అభిప్రాయపడుతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అంతర్గత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ. 8.13 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్టు వెల్లడించారు అధికారులు. అలాగే, అందులో నుండి రూ. 4.62 కోట్ల మేర రికవరీ అయినట్లు, 14 మంది సబ్ రిజిస్ట్రార్ల మీద చర్యలు తీసుకున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఏప్రిల్ ,2020 నుంచి జులై,2021 వరకు 15 నెలల కాలంలో సీఎఫ్ఎంస్ ద్వారా చెల్లించిన చలాన్లు,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన రిజిస్ట్రేషన్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. ఈ పీరియడ్‌లో మొత్తం 2కోట్ల చలాన్లు జారీ అవగా 50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.వీటిల్లో ఏవి నకిలీ చలాన్లు,ఏవి ఒరిజినల్ అనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

సీఎంఎఫ్ ఎస్ అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనెజ్‌మెంట్ సిస్టమ్. ఇందులో ఉండే సిటిజెన్ చలాన్ ఆప్షన్ ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలకు ఆన్‌ లైన్‌ లో చలాన్లు చెల్లించవచ్చు. అనంతరం ఆ రిసిప్ట్‌ ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే సీఎంఎఫ్ ఎస్ లో చలానా ద్వారా చెల్లించిన మొత్తం,ఆ రిసిప్ట్‌ లో ఉన్న మొత్తం ఒకటేనా అని వెరిఫై చేసే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు లేదు. రెండు చోట్ల వేర్వేరు సాఫ్ట్‌ వేర్లను ఉపయోగిస్తుండటం,రెండింటి మధ్య అనుసంధానం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.

ఇదే అదనుగా కొంతమంది రిసిప్ట్‌లో ఉన్న మొత్తాన్ని ఎడిట్ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు సీఎంఎఫ్ ఎస్ సైట్‌ లో ఒక వ్యక్తి రూ.2000 చలానా చెల్లించాడు అనుకుందాం. కానీ రిసిప్ట్‌లో ఆ మొత్తాన్ని రూ.20వేలు లేదా రూ.2లక్షలుగా ఎడిట్ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అలా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును ఇలాంటి చీప్ ట్రిక్స్‌ తో కట్టకుండా జారుకుంటున్నారు. ఏప్రిల్ ,2020 నుంచి జులై,2021 వరకు ఈ రకమైన రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 12 కీలక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. గత 15 నెలలు