Begin typing your search above and press return to search.
బాధపడ్డా..బొజ్జల ఏ మాత్రం తగ్గరట
By: Tupaki Desk | 3 April 2017 12:45 PM GMTమంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవి నుంచి తొలగించడని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి కారణంగా మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. పార్టీ కంటే మీ ఆరోగ్యమే ముఖ్యమని తనతో చెప్పారని బొజ్జల అన్నారు. చివరి శ్వాస వరకూ పార్టీకి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని బొజ్జల అన్నారు. ఈ దిశగా తాను తప్పకుండా పనిచేస్తానని వివరించారు. కాగా, ఒక్కరోజులోనే నిరసన నుంచి నిర్వేదమైన స్వరానికి వచ్చి బొజ్జల మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
కాగా, ఒకింత ఆవేదనతోనే బొజ్జల తన మనసులోని మాటలను వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో తనకు అసంతృప్తి ఉన్నా, పదవి నుంచి తొలగించడం ఇష్టం లేకపోయినా చేసేదేం లేదని ఆవేదన భరితంగా అన్నారు. మంత్రివర్గ కూర్పు అన్నది ముఖ్యమంత్రి ఇష్టం అని వ్యాఖ్యానించారు. కుమారుడి కోసమే తాను పనిచేస్తున్నట్లుగా చెప్పడం సరికాదని బొజ్జల అన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వారసుడైనంత మాత్రాన కిరీటం పెట్టరని బొజ్జల వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొందరు నేతలు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని అన్నారు. కేబినెట్ లో 26 మందికి మించి చోటు లేదన్న విషయాన్ని గమనించకుండా శ్రుతి మించి వ్యవహరించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలు బాగుంటేనే పార్టీ బాగుంటుందన్న విషయాన్ని నేతలు గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు. మంత్రిగా అవకాశం దక్కని మరో రూపంలో న్యాయం చేస్తామని, భవిష్యత్ బాగుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/