Begin typing your search above and press return to search.

చివరకు మంత్రి కూడా కూలీలే అంటున్నారే?

By:  Tupaki Desk   |   11 April 2015 11:33 AM GMT
చివరకు మంత్రి కూడా కూలీలే అంటున్నారే?
X
దేశంలో కూలీ అనే పదానికి అర్థం మారిపోయిందా? రాత్రివేళ అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి వేసే వారిని కూలీలు అంటూ చెప్పటంతో.. పగటిపూట కాయకష్టం చేసే వారికి మరేదైనా హోదా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

శ్రమను మాత్రమే నమ్ముకొని.. చట్టానికి లోబడి పని చేసే శ్రామికుల పేరును.. అడవి దొంగలకు.. ఎర్రచందనం స్మగ్లర్లకు తగిలిస్తుంటే కూలీ ప్రపంచం ఎందుకు ఊరుకుంటుంది? తమను దొంగలతో సరిసమానంగా పోలుస్తున్న నాయకుల్నిఎందుకు ప్రశ్నించటం లేదు. అక్రమంగా ఎర్రచందనం దుంగల్ని ఆడవుల నుంచి తరలిస్తున్న వారిని కూలీలు అంటుంటే.. మరి.. పొలాల్లో పని చేసే వారు.. రోజువారీగా పని చేసే వారిని ఇంకేం అనాలి?

కొన్ని మీడియా సంస్థలు.. కొందరు రాజకీయ నాయకులు.. మరికొన్ని పార్టీలు అడవుల్లో దొంగతానాలు చేసే వారిని కూలీలుగా అభివర్ణిస్తుంటే.. వారికి వత్తాసుగా ఏపీ మంత్రి మాట్లాడటం తాజా విశేషం.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సైతం ఎర్రచందనంను అక్రమంగా అడవుల్లో నుంచి తరలిస్తున్న వారిని దొంగలుగా అభివర్ణించారే కానీ.. వారిని కూలీలుగా మాట వరసకు సంబోధించలేదు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ మంత్రి బజ్జట గోపాలకృష్ణారెడ్డి మాత్రం ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలిస్తున్న వారిని కూలీలుగా అభివర్ణించటంలో అంతర్యం ఏమిటి?

తమిళులంటే గౌరవమని.. వాళ్లను అగౌరపరిచే విధంగా తాము వ్యవహరించటం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న బజ్జల.. ఎర్రచందనం దొంగల్ని మాత్రం కూలీలుగా సంబోధించారు. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను తమిళనాడు రాజకీయనాయకులు రాజకీయంగా చిత్రీకరిస్తున్నారని.. కూలీల ఫోన్‌కాల్‌ ఆధారంగా విచారణ జరుగుతోందన్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్న బజ్జలకు అంత సీన్‌ లేదని.. ఎందుకంటే.. దొంగల్ని కూలీలుగా ఆయన నోట మాట వచ్చినప్పుడే ఆయన ఎంత పీకుతారో ఇట్టే అర్థమైపోయింది. ఇలాంటి నేతల వల్లే జాతి సంపద దొంగల (కూలీలు అనాలా?) వశం అవుతోంది.