Begin typing your search above and press return to search.

చిత్తూరు కోర్టులో బాంబు బ్లాస్టు

By:  Tupaki Desk   |   7 April 2016 7:56 AM GMT
చిత్తూరు కోర్టులో బాంబు బ్లాస్టు
X
చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. చిత్తూరు మేయర్‌ దంపతుల కేసులో ప్రధాన నిందితుడు చింటూను కోర్టు విచారణకు తీసకువస్తున్న సమయంలోనే ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి... మూడు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పోలీసులు అలర్టయి వెంటనే ఆ ప్రాంగాణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. బాంబు స్వ్వాడ్ తనిఖీలు నిర్వహించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

అయితే... మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా అదేసమయంలో వేరే కేసులో కోర్టుకు వచ్చారు. దీంతో ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కూడా అటాక్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీకే బాబుపైనా గతంలో పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. దీంతో ఇది చింటూ లక్ష్యంగా ఏర్పాటు చేసిన బాంబా? లేదంటే సీకే బాబు ను లక్ష్యంగా చేసుకున్నదా అన్నది ఇంకా తేలలేదు.

కాగా గత ఏడాది చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ ను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. మోహన్ మేనల్లుడు చింటూయే ఈ హత్యకు పాల్పడ్డారు. ఆ కేసు విచారణలో భాగంగా చింటూను గురువారం కోర్టుకు తీసుకొచ్చారు. అదే సమయంలో సీకే బాబును కూడా తీసుకొచ్చారు. ఇద్దరు రౌడీయిజం బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే కావడంతో వారిలో ఎవరో ఒకరి ప్రత్యర్థులు ఈ బాంబు దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.