Begin typing your search above and press return to search.
జగన్ పర్యటనకు ఒక్క రోజుముందే బాంబు పేలుళ్లు...భీమవరంలో ఏంటి ఈ కలకలం?
By: Tupaki Desk | 13 Aug 2021 2:34 PM GMTతెలుగు సినిమాల ప్రభావం కావచ్చు... సాహిత్యం ద్వారా కలిగిన భావన కావచ్చు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అంటే ఉండే అభిప్రాయం వేరే లెవల్లో ఉంటుంది. ప్రేమాభిమానాలు, శాంతి సౌభాగ్యాలు, సంతోషాలకు నెలవు భీమవరం అన్న భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటి భీమవరంలో బాంబు పేలుడు జరగడం అందులోనూ ... ఏపీ సీఎం జగన్ పర్యటనకు ముందు రోజు కావడం తీవ్ర కలకలం రేపింది. బాంబు పేలుడు గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
భీమవరం-ఉండి రహదారి వెంట ఆవు మేత మేస్తుండగా బాంబు పేలింది. పేలుడు ధాటికి ఆవు తీవ్రంగా గాయపడింది. శనివారం సీఎం జగన్ భీమవరంలో పర్యటించనుండగా... సరిగ్గా ఒక్కరోజు ముందే బాంబు పేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పేలింది నాటుబాంబా లేక వేరేదా.? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తూ ఏం జరిగిందనే విషయంలో అన్వేషణ చేస్తున్నారు.
ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు సీఎం వైఎస్ జగన్ శనివారం భీమవరం రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బాంబు పేలుడు జరగడం, ఆవు తీవ్రంగా గాయపడటం కలకలం రేపుతోంది.