Begin typing your search above and press return to search.
కోడెల ఊరిలో బాంబులు పేలాయి
By: Tupaki Desk | 15 April 2016 7:11 AM GMTఏపీ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఒక ఆరోపణ చేస్తుంటారు. గతంలో ఆయనకు చెందిన ఇంట్లో బంబుల పేలాయంటూ విమర్శిస్తుంటారు. అయితే.. ఆ కేసులో తనను రాజకీయ ప్రత్యర్థులు ఇరికించారని.. తాను ఆ కేసులో నిర్దోషినని కోడెల చెప్పుకుంటుంటారు. ఏమైనా కోడెల మాటకు బాంబుల లంకె ఎప్పుడూ వినిపిస్తూనే ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తుంటారు.
ఇదిలా ఉంటే కోడెల ఊరుగా ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఈ రోజు బాంబుల మోత మోగటం సంచలనంగా మారింది. నరసరావుపేట మండలం పమిడిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంట్లో శుక్రవారం ఉదయం బాంబులు పేలటం సంచలనంగా మారింది. ఉన్నట్లుండి బాంబులు పేలటంతో గ్రామంలోని వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గ్రామస్థుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిగా గ్రామానికి చేరుకున్నారు. లక్కీగా.. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవటం విశేషం. ఇంతకీ కోడెల ఇలాకాలో అధికార పార్టీకి చెందిన నేత ఇంట్లో బాంబులు పేలటం ఏమిటి? దీని వెనుకున్న అసలు కారణమం ఏమిటన్నది బయటకు రావాల్సి ఉంది.