Begin typing your search above and press return to search.
అమెరికా వెన్నులో 'వణుకు' పుట్టిన బాంబ్ సైక్లోన్..!
By: Tupaki Desk | 25 Dec 2022 3:57 AM GMTఅగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాంకేతిపరంగా అద్భుతాలు సాధించే అమెరికాకు ప్రతిసారీ ప్రకృతి నుంచి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. తుఫానులు.. టోర్నెడోలు.. భూకంపాలు.. కరోనా వైరస్ ఇలా ప్రతీది ఆ దేశాన్ని ఇటీవలి కాలంలో పట్టి పీడిస్తున్నాయి.
శీతాకాలంలో అమెరికాను మంచు దుప్పటి కప్పేయడం అనేది ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతు వస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం అమెరికాలో మంచు తుఫానులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రజలు జాగ్రత్తలు లేకుండా బయటకు వస్తే మంచుతో గడ్డకట్టుకొని పోయే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఇందుకు తార్కాణంగా కన్పిస్తోంది.
ప్రస్తుతం అమెరికాను బాంబ్ సైక్లోన్ తీవ్రంగా కలవరపెడుతోంది. దీని కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయింది. క్రిస్మస్ వేళ బాంబ్ సైక్లోన్ ల కారణంగా ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు దాపురించాయి. దీంతో అమెరికాలోని పలు నగరాల్లో క్రిస్మస్ సంబురాలు కళ తప్పినట్లు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాంబ్ సైక్లోన్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
బాంబ్ సైక్లోన్ లేదా బాంబు తుఫానును వేగంగా కదిలే తీవ్రమైన తుఫానుగా వాతావరణ శాఖ నిర్వచించింది. దీనిని ఐంఐటీ వాతావరణ శాస్త్రవేత్తలు ఫ్రెడ్ సాండర్స్.. జాన్ గ్యాకుమ్.. స్వీడిష్ వాతావరణ నిపుణుడు టోర్ బెర్గెరాన్ లు 1980లో కనుగొన్నారు. 24 గంటల్లో 24 mbar ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అనూహ్యమైన వేగవంతమైన లోతైన తుఫానులను తొలిసారిగా ‘బాంబ్ సైక్లోన్’ గా నిర్వచించారు.
బాంబు తుఫాను అపూర్వమైన స్వభావం దాని తక్కువ ఉష్ణోగ్రతల తీవ్రతల నుంచి వచ్చిందని పేర్కొన్నారు. 24 గంటల్లో ఇది 20 మిల్లీబార్లు లేదా అంతకంటే ఎక్కువ వాయు పీడనాన్ని కలిగిస్తుందని వివరించారు. వెచ్చని గాలి ద్రవ్యరాశి చల్లని గాలితో ఢీకొన్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈసారి ఆర్కిటిక్ నుంచి గాలి గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి ఉష్ణమండల గాలికి వ్యాపించిందని వెల్లడించారు.
దీని వల్ల వర్షం.. మంచును తెచ్చే మాంద్యానికి కారణమైందని యూఎస్ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో చలిగా ఉందని.. అమెరికాలోని మిన్నెసోటాలో మైనస్ 38 డిగ్రీల వరకు పడిపోయిందని.. ప్లోరాడాలో హిమపాతం కొనసాగుతూనే ఉందని వెల్లడించింది. ఈ చలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.