Begin typing your search above and press return to search.

చైనాలోని అమెరికా ఎంబ‌సీ వ‌ద్ద బాంబుపేలుడు

By:  Tupaki Desk   |   26 July 2018 10:03 AM GMT
చైనాలోని అమెరికా ఎంబ‌సీ వ‌ద్ద బాంబుపేలుడు
X
ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో బాంబుపేలుళ్లు చోటు చేసుకున్న వార్త‌లు వ‌స్తాయి. కానీ.. ప్ర‌పంచంలోనే భారీ జ‌నాభా ఉన‌న చైనాలో ఈ త‌ర‌హా వార్త‌లు క‌నిపించ‌వు. తాజాగా అందుకు భిన్న‌మైన ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డిన‌ట్లైంది.

చైనా రాజ‌ధాని బీజింగ్ లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ రోజు (గురువారం) ఉద‌యం ఎంబ‌సీ స‌మీపంలో పేలుడు శ‌బ్దాలు వినిపించ‌టంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఒక్క‌సారిగా బాంబుపేలుడు శ‌బ్దం వినిపించ‌టంతో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల వారు ఉలిక్కిప‌డ్డారు.

స‌మాచారం తెలిసిన వెంట‌నే పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. పేలుడుకు కార‌ణ‌మైంది చైనాకు చెందిన 26 ఏళ్ల వ్య‌క్తిగా గుర్తించారు.

చైనా స్థానిక కాల‌మానం ప్ర‌కారం గురువారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఇన్న‌ర్ మంగోలియా ప్రాంతానికి చెందిన ఒక వ్య‌క్తి అమెరికా రాయ‌బార కార్యాల‌యం ఎదుట బాంబు దాడికి ప్ర‌య‌త్నించాడు. అయితే.. అది కాస్తా అత‌ని చేతిలోనే పేలిపోయింది. అయితే.. బాంబు పేలుడు తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో ఎవ‌రికి ఎలాంటి ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌లేదు. చివ‌ర‌కు బాంబు పేల్చిన నిందితుడికి ఏమీ కాలేదు.

ఈ పేలుడు సంభ‌వించిన ప్రాంతానికి ద‌గ్గ‌ర్లోనే భార‌త ఎంబ‌సీ ఉండ‌టం గ‌మ‌నార్హం. పేలుడుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాంబు పేలుడుకు కాస్త ముందుగా ఒక యువ‌తి అమెరికా ఎంబ‌సీ ఎదుట సూసైడ్ అటెంప్ట్ చేసింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఆమెత‌న ఒంటి మీద కిరోసిన పోసుకొని నిప్పు అంటించుకోవాల‌ని ప్ర‌య‌త్నించినట్లుగా తెలుస్తోంది. దీనిపై చైనా పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.